Breaking News

ప్రభాస్‌ 'స్పిరిట్‌'లో హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసిన బ్యూటీ.. ప్రకటన వచ్చేసింది

Published on Sat, 05/24/2025 - 19:19

 ప్రభాస్- సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'స్పిరిట్‌' (Spirit Movie).. తాజాగా ఈ మూవీలో నటించబోయే హీరోయిన్‌ను మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ ప్రకటన వచ్చిన సమయం నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్‌ ఎప్పుడు మొదలవుతుందా..? అని కొంతకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యానిమల్‌ సినిమా తర్వాత దర్శకుడు సందీప్‌ రెడ్డి పూర్తిగా స్పిరిట్‌ సినిమా కోసమే పనిచేస్తున్నారు.  ఇప్పటికే సినిమాకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. త్వరలో షూటింగ్‌ కూడా ప్రారంభం కానుంది.

స్పిరిట్‌ సినిమా ప్రకటన వచ్చిన తర్వాత మొదటిసారి అధికారికంగా ఒక ప్రకటన చేశారు మేకర్స్‌.. ఈ మూవీలో  హీరోయిన్‌గా మృణాల్‌ ఠాకూర్, దీపికా పదుకోణ్‌ ఆలియా భట్, రష్మికా మందన్నా సహా పలువురు తారల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, ఆ ఛాన్స్‌ను త్రిప్తి డిమ్రీ (Tripti Dimri) అందుకుంది. తాజాగా ఇదే విషయాన్ని చెబుతూ సందీప్‌ ఒక పోస్ట్‌ షేర్‌ చేశారు.

సందీప్‌ షేర్‌ చేసిన పోస్టర్‌ను బట్టి చూస్తే స్పిరిట్‌ చిత్రాన్ని దాదాపు 9 భాషలలో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. పోస్టర్‌లో త్రిప్తి డిమ్రీ పేరును  తెలుగుతో పాటు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, ఇంగ్లీష్‌, చైనీస్‌, జపనీస్‌, కొరియన్‌ భాషల్లో రాశారు. యానిమల్‌ సినిమాతో త్రిప్తి డిమ్రీకి మంచి గుర్తింపు దక్కింది. ప్రభాస్‌ తన కెరీర్‌లో తొలిసారి పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్నారు. మెక్సికోలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభింస్తామని సందీప్‌ తెలిపారు.  ఇందులో విలన్‌గా దక్షిణ కొరియా స్టార్‌ నటుడు మా డాంగ్‌ సియోక్‌ను (Ma Dong-seok) తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆనందంలో త్రిప్తి
స్పిరిట్‌ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేసినందుకు త్రిప్తి డిమ్రీ కృతజ్ఞతలు తెలిపింది. 'ఈ ప్రకటన రాగానే చాలా ఆనందంలో మునిగిపోయాను. ఈ జర్నీలో నన్ను నమ్మినందుకు సదా రుణపడి ఉంటాను. మరోసారి మీ విజనరీలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్యూ సందీప్‌ రెడ్డి వంగా' అంటూ ఆమె తెలిపింది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)