Breaking News

ప్రముఖ నటి ఇంట్లో తీవ్ర విషాదం..!

Published on Tue, 04/11/2023 - 21:18

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. శాండల్‌వుడ్‌ నటి అనితా భట్ సోదరుడు గుండెపోటుతో మరణించారు. దీంతో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇటీవల గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ విషయాన్ని ఆమె తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. సోదరుని మరణాన్ని తలుచుకుంటూ కన్నీటి పర్యంతమైంది. 

అనితా ట్వీట్‌లో రాస్తూ.. 'నిన్న నా గుండె ముక్కలైంది. కార్డియాక్ అరెస్ట్‌తో మా సోదరుడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఈ బాధను మాటల్లో వర్ణించలేను. అతను తిరిగి రాలేడనే చేదు నిజాన్ని అంగీకరించక తప్పదు. దయచేసి అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. ఈ కష్ట సమయంలో మీ అందరి ఆశీస్సులు కావాలి.' అంటూ పోస్ట్ చేసింది. సోదరునితో చిన్నప్పుడు దిగిన ఫోటోను షేర్ చేస్తూ అనితా భావోద్వేగానికి లోనైంది.

కాగా.. అనితా భట్ 2008లో సైకో అనే సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత ఆమె దశవాల, సిల్క్, సుగ్రీవ, పరపంచ, రాజ్ బహదూర్, టగరు, డేస్ బోరాపూర్, హోసా క్లైమాక్స్ లాంటి చిత్రాలలో నటించింది. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)