Breaking News

సినిమా కోసం కాదు.. రూమ్‌కు రమ్మని పిలుస్తారు: సనం శెట్టి

Published on Wed, 02/19/2025 - 13:11

'మమ్మల్ని పిలుస్తోంది సినిమాలో నటించేందుకు కాదు.. వారితో కలిసి రాత్రంతా రూమ్‌లో ఉండేందుకు!' అంటూ ఆగ్రహం, అసహనం ఒకేసారి వ్యక్తం చేసింది నటి సనం శెట్టి (Sanam Shetty). సమానత్వం అంటే ఇదా? అని ప్రశ్నించింది. కూల్‌ సురేశ్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ప్రారంభోత్సవానికి సనం శెట్టి హాజరైంది. ఈ సందర్భంగా ఆమె.. వెట్రిమారన్‌ డైరెక్ట్‌ చేసిన బ్యాడ్‌ గర్ల్‌ సినిమా టీజర్‌పై విమర్శలు గుప్పించింది.

అది సమానత్వమా?
సనం శెట్టి మాట్లాడుతూ.. బ్యాడ్‌గర్ల్‌ టీజర్‌ బోల్డ్‌ ఎగ్జాంపుల్‌ కాదు.. అదొక చెత్త ఉదాహరణ. స్వేచ్ఛ, లింగసమానత్వం అనే అంశాలను చాలా తప్పుగా చూపించారు. అబ్బాయిలతో పోటీపడి సిగరెట్‌ తాగడం, మందు తాగడం సమానత్వం కాదు. సమానత్వం అంటే అన్నింట్లోనూ మాకు సమాన అవకాశాలివ్వాలి, సమాన గౌరవం దక్కాలి. హీరోను సంప్రదించే విధానం, హీరోయిన్‌ను సంప్రదించే విధానం ఒకేలా ఉందా? లేదు. నన్నే తీసుకోండి. సినిమాలో నటించమని పిలవడానికి బదులు వారితో కలిసి గదిలో ఉండమని పిలుస్తున్నారు. ఇది సమానత్వమా?

ఎందుకు తీస్తారో అర్థం కాదు
బ్యాడ్‌ గర్ల్‌ టీజర్‌ ఏమాత్రం బాగోలేదు. ఇది టీనేజీ అమ్మాయిలను చెడగొట్టేలా ఉంది. ఇలాంటి చెత్త మూవీస్‌ ఎందుకు తీస్తారో అర్థం కాదు. బాధ్యతాయుతమైన ఫిలింమేకర్స్‌ ఇలాంటి సినిమాలు చేయడం మరింత బాధాకరం అని చెప్పుకొచ్చింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ ట్వీట్‌ చేసింది. అంబులి 3డీ సినిమాతో తమిళ చిత్రసీమకు పరిచయమైందీ బ్యూటీ. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, హీరోయిన్‌గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేసింది. శ్రీమంతుడు, సింగం 123, ప్రేమికుడు చిత్రాలతో తెలుగువారికి పరిచయమైంది. ప్రస్తుతం తమిళంలో ఎతిర్‌ వినైయాత్రు మూవీ చేస్తోంది.

 

 

చదవండి: కథ బాగోలేదని ఛీ కొట్టిన హీరో.. దర్శకుడు ఏం చేశాడంటే?

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)