Breaking News

టాలీవుడ్‌తోనే నా కెరీర్ మలుపు తిరిగింది: సంయుక్త

Published on Tue, 02/14/2023 - 08:43

‘భీమ్లానాయక్‌’, ‘బింబిసార’ సినిమాలతో తెలుగు తెరపై మెరిసిన నటి సంయుక్త మీనన్. ఇటీవల ధనుష్‌కి జోడీగా ‘సార్‌’లో నటించింది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 17న చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు. టాలీవుడ్ అడుగు పెట్టాకే తన దశ తిరిగిందని అన్నారు. అందుకే ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చింది అమ్మడు. 

సంయుక్తా మీనన్‌ మాట్లాడుతూ – '‌బింబిసార, విరూపాక్ష సినిమాలకి సంతకం చేశాకే భీమ్లానాయక్‌లో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా కోసం హైదరాబాద్‌కి వచ్చా. అప్పుడు నాకు తెలుగు అంతగా రాదు. కానీ ఓ రోజు సెట్లో నా గురించి ఏదో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది. ఈ విషయంపై నిర్మాత నాగవంశీని అడిగితే... భీమ్లానాయక్‌ తర్వాత ధనుష్ మూవీ సార్‌లో కథానాయిక మీరేనని చెప్పారు. అదే రోజు దర్శకుడు వెంకీ అట్లూరిని కలిశా. అలా మొదలైన ప్రయాణం ఇక్కడిదాకా వచ్చింది. కల్యాణ్ రామ్ బింబిసార తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ఒప్పుకున్నా. ఆ భీమ్లా నాయక్‌, ధనుష్‌ ‘సర్‌’ చిత్రాలు ఒకే రోజులోనే అంగీకరించా.' అని చెప్పుకొచ్చారు మలయాళ భామ.

సినిమాల్లోకి ఎంట్రీపై సంయుక్త మాట్లాడుతూ.. 'సినిమాల్లోకి రావాలని ఏనాడూ అనుకోలేదు. అనుకోకుండా 2016లో నా జర్నీ స్టార్ట్ చేశా. చదువుకుంటున్న సమయంలోనే అనుకోకుండా వచ్చిన అవకాశంలో తొలి సినిమా చేశా. ఆ  తర్వాత ఒక మంచి సినిమా చేసి ఆ తర్వాత మానేద్దామని మళ్లీ వచ్చా. కానీ ఆ తర్వాత నటనపై మక్కువ పెరిగింది. అయితే టాలీవుడ్‌లోకి వచ్చాకే నా దశ తిరిగింది. మొదట్లో  ఇంగ్లిష్‌ మాట్లాడేదాన్ని. అందరూ ఇంగ్లిష్‌ అమ్మాయిలానే చూసేవాళ్లు. ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నందుకు తెలుగమ్మాయి అంటున్నారు. తెలుగు నేర్చుకునేందుకు ట్యూటర్ సాయం తీసుకున్నా.అలా తెలుగు వేగంగా నేర్చుకుంటున్నా.' అని అన్నారు. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)