Breaking News

కార్మేని సెల్వం టీజర్‌: అప్పు చేసైనా ఖర్చు పెట్టాలి!

Published on Thu, 03/12/2026 - 19:08

సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘కార్మేని సెల్వం’. ఇందులో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. గురువారం ఈ మూవీ తెలుగు టీజర్‌ రిలీజ్‌ చేశారు. "డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి" అని సముద్రఖని వాయిస్ ఓవర్‌తో టీజర్‌ మొదలవుతుంది. అధిక ఖర్చులు, భారీ లోన్లు, క్రిప్టో పెట్టుబడులు, త్వరగా ధనవంతులు కావాలనే ఆశతో చేసే ప్రయత్నాలు.. ఇలా నేటి సమాజంలో డబ్బు పట్ల ఉన్న ఆలోచనలను చూపించిన విధానం ఆకట్టుకుంటోంది. 

రిచ్‌ కావాలంటే..
ముఖ్యంగా ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ ఆధారిత జీవనశైలి, డబ్బు కోసం మనుషులు తీసుకునే నిర్ణయాలు కథలో కీలక పాత్ర పోషించబోతున్నాయని అర్థమవుతుంది. సముద్రఖని కుటుంబంతో కనిపించే సన్నివేశాలు హృదయానికి హత్తుకునేలా ఉండనున్నాయి. టీజర్ చివర్లో.. “ధవంతుడివి కావాలంటే రిచ్ మనిషిలా ఖర్చు చేయడం నేర్చుకోవాలి… డబ్బు లేకపోతే అప్పు తీసుకునైనా ఖర్చు చేయాలి” అని సముద్రఖని చెప్పే డైలాగ్ నేటి మనుషుల పోకడను తెలియజేస్తోంది. 

సినిమా
ఈ మూవీని రామ్ చక్రి దర్శకత్వంలో పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై  అరుణ్ రంగరాజులు నిర్మిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ మూవీ ఏప్రిల్‌ 3న విడుదల కానుంది. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్  ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)