Breaking News

'ప్యారడైజ్'లో తెలుగు కమెడియన్.. అస్సలు ఊహించలే

Published on Fri, 12/19/2025 - 18:38

నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'ద ప్యారడైజ్'. వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలో రిలీజ్ చేయడమే టార్గెట్‌గా షూటింగ్ చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పుట్టినరోజు సందర్భంగా చిన్నపాటి మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇప్పుడు సడన్‌గా మూవీలో మరో పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి చిన్నపాటి షాకిచ్చారు.

'ద ప్యారడైజ్' మూవీలో నానితో పాటు మోహన్ బాబు నటిస్తున్నారు. హిందీ నటుడు రాఘవ్ జూయెల్ కీలక పాత్ర చేస్తున్నాడు. ఇది తప్పితే మిగతా నటీనటుల గురించి పెద్దగా తెలీదు. ఇప్పుడు ఈ మూవీలో తెలుగు కమెడియన్ సంపూర్ణేశ్ బాబు కూడా ఉన్నట్లు బయటపెట్టారు. బిర్యానీ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.

సంపూ ఇప్పటివరకు కామెడీ సినిమాల్లో హీరోగా, సహాయ నటుడిగా చేశాడు. మధ్యలో ఓసారి బిగ్‌బాస్ షోలో పాల్గొన్నాడు. గత కొన్నాళ్ల నుంచి అయితే కొత్త మూవీస్ ఏం చేస్తున్నట్లు లేదు. అలాంటిది ఇప్పుడు 'ప్యారడైజ్'లో మాస్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడని క్లారిటీ వచ్చేసింది. పోస్టర్‌లో రక్తంతో తడిసిన చేయి, భుజంపై గొడ్డలి చూస్తుంటే అసలు ఇది సంపూర్ణేశ్ బాబుయేనా అని సందేహం రాకమానదు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)