Breaking News

ప్రసవం తర్వాత బరువు పెరిగా.. విపరీతంగా ట్రోల్స్: టాలీవుడ్ హీరోయిన్

Published on Tue, 08/26/2025 - 17:48

హీరోయిన్‌ సమీరా రెడ్డి తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. ఒక సమయంలో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. అశోక్‌, జై చిరంజీవ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమీరా.. 2014లో అక్షయ్‌ని వివాహం చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. అయితే ప్రస్తుతం సమీరా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు టచ్‌లోనే ఉంటోంది.

అయితే పెళ్లి తర్వాత తన శరీరంలో వచ్చిన మార్పులతో విపరీతంగా ట్రోలింగ్‌కు గురైనట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తన బాడీపై ట్రోల్స్‌ చేయడంతో తీవ్రమైన నిరాశకు గురయ్యానని తెలిపింది. మొదటి బిడ్డ పుట్టిన తర్వాత హార్మోన్స్ ఇన్‌బ్యాలెన్స్ వల్ల చాలా బరువు పెరిగానని పేర్కొంది. ఈ సమయంలో కష్టకాలం ఎదుర్కొన్నట్లు తాజా ఇంటర్వ్యూలో పంచుకుంది. అప్పట్లో తన బరువు ఏకంగా 105 కేజీలకు చేరుకుందని తెలిపింది. బరువు పెరగడం వల్లే తనను ట్రోల్ చేశారని వివరించింది.

సమీరా మాట్లాడుతూ.. 'ప్రజలు మంచివాళ్లు కాదు. వాళ్లు ఏదైనా చెప్పాలనుకుంటే మొహం మీదే చెబుతారు. నన్ను ట్రోల్ చేసే విషయంలో మా పక్కవాళ్లు కూడా నన్ను వదిలిపెట్టలేదని నేను ఎప్పుడూ చెబుతాను. ఆ సమయంలో నేను ఎలాంటి బాధను అనుభవిస్తున్నానో ఎవరికీ అర్థం కాదు. అందుకే ఈ విషయంలో నేను ఎలాంటి అబద్ధం చెప్పను" అని అన్నారు. కాగా.. సమీరా రెడ్డి 13 ఏళ్ల తర్వాత చిమ్ని అనే హర్రర్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)