Breaking News

ప్రియుడితో సినిమాకు.. కాబోయే అత్త కూడా వెంటే వచ్చేది: హీరోయిన్‌

Published on Sat, 11/16/2024 - 16:39

నరసింహుడు, అశోక్‌, జై చిరంజీవ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హీరోయిన్‌ సమీరా రెడ్డి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. సినిమాలకు, షికార్లకు వెళ్లినప్పుడు ప్రియుడి తల్లి కూడా తన వెంటే వచ్చేదట!

అమ్మను తీసుకెళ్తాం..
దీని గురించి సమీరా ఇంకా మాట్లాడుతూ.. అక్షయ్‌తో డేట్‌కు వెళ్లినప్పుడు అతడి తల్లిని కూడా తీసుకొచ్చేవాడు. మా అమ్మ విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. తను ఎక్కడికి వెళ్లాలన్నా మేమే తీసుకెళ్తాం. మేము ఎక్కడికి వెళ్లినా తననూ వెంటపట్టుకుని వెళ్తాం. అందుకనే మనం సినిమాకు వెళ్లినప్పుడు తనను కూడా తీసుకొస్తున్నా అన్నాడు. అది విని నాకు ఆశ్చర్యమేసింది. 

రాత్రి బస చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌
ఎప్పుడైనా తన ఇంట్లో రాత్రి నిద్ర చేసేందుకు కూడా అడ్డు చెప్పేది కాదు. పెళ్లికి ముందు అక్షయ్‌తో ఉండనిచ్చేది. తను చాలా సపోర్ట్‌గా నిలిచింది అని చెప్పుకొచ్చింది. కాగా సమీరా, అక్షయ్‌ 2014లో పెళ్లి చేసుకున్నారు. అక్షయ్‌ కంటే సమీరా రెండేళ్లు పెద్దది కావడం గమనార్హం. ఈ దంపతులకు ఇద్దరు చిన్నారులు జన్మించారు. దశాబ్దకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమీరా నామ్‌ మూవీతో రీఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రం నవంబర్‌ 22న విడుదల కానుంది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)