Breaking News

నా జీవితం మారింద‌నుకోవ‌ట్లేదు.. అప్పటి వ‌ర‌కే నేను స్టార్‌ని: సమంత

Published on Sat, 04/08/2023 - 21:36

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా శాకుంతలం. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడటంతో వరుస ఇంటర్వ్యూలతో ప్రమోషన్స్‌ జోరు పెంచారు మేకర్స్‌. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి శకుంత‌ల, దుష్యంతుల అమ‌ర‌ ప్రేమ‌గాథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ముంబయిలో నిర్వహించిన ప్రమోషన్లలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విషయాలను పంచుకున్నారు స‌మంత. 

సమంత మాట్లాడుతూ.. 'నేను చిన్న‌ప్ప‌టి నుంచీ డిస్నీ జోన‌ర్ సినిమాల‌ను చాలా ఇష్ట‌ప‌డేదాన్ని. నేను ఆనందంగా ఉన్నా, బాధ‌లో ఉన్నా వాటినే చూసేదాన్ని. ఈ సినిమాలో యువ‌రాణిగా న‌టించ‌డం చాలా ప్ర‌త్యేకంగా అనిపించింది. శాకుంత‌లం క‌థ నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన‌ప్పుడు చాలా ఆలోచించాను. కాస్త భ‌య‌ప‌డ్డా. కానీ, కొన్నేళ్లుగా సవాళ్ల‌ు స్వీక‌రించ‌డం నాకు అల‌వాటైపోయింది. నా చిన్న‌త‌నంలో శ‌కుంత‌ల పాత్ర గురించి చాలా క‌ల‌లు క‌నేదాన్ని. అమ్మాయిలు, మ‌హిళ‌లు, ఫ్యామిలీలు త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు. ఈ పాత్ర‌లో న‌టిస్తున్నంత సేపు ఓ ప్రేక్ష‌కురాలిగా నేను సినిమాను ఆస్వాదించా. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ సినిమా ఇది. నా దృష్టిలో ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ఫెమినిస్ట్. ఆయ‌న ఫీమేల్ ఓరియంటెడ్ క‌థ‌లు రాస్తారు. ' అని అన్నారు. 

అల్లు అర్జున్ గారాల పట్టి గురించి మాట్లాడుతూ.. 'నా దృష్టిలో అల్లు అర్హ స్వ‌తంత్రురాలు. త‌నకు కావాల్సిన నిర్ణ‌యాలు తానే తీసుకోగ‌ల‌దు. అర్హ కెరీర్ విషయంలో అల్లు అర్జున్‌ జోక్యం అవ‌స‌రం లేదు. అర్హ కెరీర్‌లో ఇది అద్భుత‌మైన చిత్రం. అర్హ రోల్ చాలా అద్భుతంగా వ‌చ్చింది. అందుకే పిల్ల‌లు, ఫ్యామిలీస్ ఈ క‌థ‌ను ఆస్వాదిస్తారని న‌మ్ముతున్నా.' అని తెలిపింది. 

పాన్ ఇండియా స్టార్ అయ్యాక జీవితం ఎలా మారింది? అని అడగ్గా స‌మంత స‌ర‌దాగా స్పందించారు. తాను పాన్ ఇండియా స్టార్‌న‌నే విష‌యాన్ని త‌న పెంపుడు జంతువుల‌కి ఎవ‌రైనా చెబితే బాగుంటుంద‌ని అన్నారు. నేనింకా వాటి మ‌లాన్ని ఎత్తిపోస్తున్నానంటూ న‌వ్వేశారు. నా జీవితం మారింద‌ని నేను అనుకోలేదని.. కేవలం నేను ఆరు గంట‌ల దాకానే స్టార్‌ని.. ఆ త‌ర్వాత నా జీవితం చాలా సాదాసీదాగా ఉంటుందని సమంత అన్నారు. నేను చేస్తున్న పాత్ర‌ల విష‌యంలో చాలా ఆనందంగా ఉన్నానని..యాక్ష‌న్ పాత్ర‌లు కూడా చేస్తున్నట్లు వెల్లడించింది. ఫ్యామిలీమేన్‌2లో నేను చేసిన పాత్ర అలాంటిదేనని..ఎప్పుడూ అబ‌లగానే కాదు.. స‌బ‌ల‌గా న‌టించాలని ఆమె అన్నారు. 

(ఇది చదవండి: శాకుంతలం నుంచి విడుదలైన 'మల్లికా' వీడియో సాంగ్‌)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)