లులు మాల్ విషయంలో తప్పు చేశాం భయపడి వెనక్కి తగ్గిన ప్రభుత్వం
Breaking News
కీర్తి సురేశ్‌కు మందు అలవాటు లేదు కానీ..: సమంత
Published on Wed, 04/08/2026 - 08:14
మాతృభాష మలయాళంలో బాలనటిగా రంగ ప్రవేశం చేసి ఆ తరువాత కథానాయికగా పరిచయం అయింది కీర్తి సురేష్. ఆ వెంటనే తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్గా నటిస్తూ క్రేజ్ సంపాదించుకుంది. మహానటి చిత్రంతో సత్తా చాటింది. ఈ మధ్య బేబీ జాన్ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ హిందీ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఏదేమైనా ఇటీవల ఈమె నటించిన చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేదు.
సినిమా
కీర్తి చివరిగా నటించిన హిట్ చిత్రం మామన్నన్. ఈమె ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవర కొండకు జంటగా రౌడీ జనార్ధన్ చిత్రంలో నటిస్తోంది. తమిళంలో ఈమె నటించిన కన్నివెడి చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఇకపోతే కీర్తి సురేష్, హీరోయిన్ సమంత మంచి స్నేహితురాళ్లు అన్నది తెలిసిందే. కాగా నటి కీర్తి సురేష్‌కి మద్యం తాగే అలవాటు ఉందని ప్రచారం జరుగుతోంది.
ఆ అలవాటు లేదు కానీ..
దీని గురించి సమంత స్పందిస్తూ.. కీర్తి సురేష్‌కు మద్యం అలవాటు లేదు కాని ఒక్క అలవాటు మాత్రం ఉందని చెప్పింది. అదేమిటంటే హైపర్ మ్యాక్ అనే అధికంగా నవ్వించే గుణం ఉందని తెలిపింది. అర్ధరాత్రి వరకు మాట్లాడుతూ నవ్విస్తూనే ఉంటుందని పేర్కొంది. అదే విధంగా అతి వేగంగా రైమింగ్ మాటలతో ఇతరులను ఆటపట్టిస్తుందని సమంత చెప్పుకొచ్చింది.
Tags : 1