Breaking News

‘శాకుంతలం’పై సమంత రివ్యూ

Published on Tue, 03/14/2023 - 14:24

సమంత ప్రధాన పాత్రలో నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘శాకుంతలం’. ప్రముఖ కవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గుణ శేఖర్‌ దర్శత్వం వహిస్తున్నారు.  ‘దిల్‌’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమా విడుదల ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడి ఫైనల్‌గా ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే పోస్ట్‌ ప్రొడక్షన్స్‌  పనులన్నీ పూర్తి చేసుకొన్న  ఈ చిత్రాన్ని తాజాగా నిర్మాతలు  'దిల్' రాజు, నీలిమా గుణతో కలిసి కలిసి సమంత వీక్షించింది. అనంతరం ఇన్‌స్టా వేదికగా ‘శాకుంతలం’పై రివ్యూ ఇచ్చింది. 

‘ఫైనల్లీ... ఈ రోజు 'శాకుంతలం' సినిమా చూశా. చాలా అందంగా ఉంది. ఇదొక దృశ్య కావ్యం. మన పురాణాల్లో గొప్ప కథల్లో ఒక్కటైన శాకుంతలం కథకు గుణశేఖర్‌గారు ప్రాణం పోశారు. బలమైన భావోద్వేగాలతో రూపొందిన చిత్రమిది. కుటుంబ ప్రేక్షకులు ఆ భావోద్వేగాలు చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. చిన్న పిల్లలకు ఈ ప్రపంచం నచ్చుతుంది. ఇటువంటి సినిమా ఇచ్చిన దిల్‌ రాజు, నీలిమా గుణలకు థాంక్స్'అని సమంత రాసుకొచ్చింది. శాకుంతలం రివ్యూ చదివిన సమంత ఫ్యాన్స్...శాకుంతలంతో సమంత మరో హిట్ అందుకోనుందని సోషల్‌ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)