Breaking News

పిల్లలు లేకపోయినా పర్లేదనుకున్నాం.. కానీ

Published on Fri, 09/11/2026 - 08:02

సాధారణంగా సెలబ్రిటీలు పెళ్లి, పిల్లల్ని కనే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. కెరీర్ పరంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందని ఈ విషయాల్ని కాస్త ఆలస్యంగానే ప్లాన్ చేస్తుంటారు. అయితే తన ప్రెగ్నెన్సీ మాత్రం అనుకోకుండానే జరిగిందని హీరోయిన్ సమంత చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదంతా బయటపెట్టింది.

'నాకు ప్రెగ్నెన్సీ రావడం పెద్ద సర్‌ప్రైజ్. గర్భం దాలుస్తానని అస్సలు ఊహించలేదు. మా ఇంటి బంగారం సినిమాలోని తస్సాదియ్యా పాట షూటింగ్ చేస్తున్న టైంలో నాకు కాస్త నీరసంగా అనిపించింది. డాక్టర్ దగ్గరకెళ్తే నా ప్రెగ్నెన్సీ గురించి తెలిసింది. నిజం చెప్పాలంటే నేను,రాజ్.. పిల్లల కోసం ప్లాన్ చేయలేదు. పెళ్లికి ముందే ఈ సంగతి మాట్లాడుకున్నాం'

'ఒకానొక టైంలో నేను, రాజ్ ఇద్దరం పిల్లలు లేకపోయినా పర్లేదని అనుకున్నాం. నాకు ఓకే. రాజ్ కూడా ఓకే అని అన్నాడు. కానీ ఇలా ప్రెగ్నెన్సీ వస్తుందని అనుకోలేదు. ఇది నాకు ఆశ్చర్యకరమైన విషయం' అని సామ్ చెప్పుకొచ్చింది. మగ-ఆడబిడ్డ ఎవరు పుట్టినా సరే వాళ్ల కోసం షాపింగ్ చేసేసింది. ఏం పేరు పెట్టాలనేది కూడా ముందే నిర్ణయించుకున్నామని కూడా సమంత చెప్పింది.

గతంలో హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత.. తర్వాత విడాకులు తీసుకుంది. గతేడాది డిసెంబరులో 'ఫ్యామిలీ మ్యాన్' డైరెక్టర్ రాజ్ నిడిమోరుని వివాహం చేసుకుంది. ఈ ఏడాది 'మా ఇంటి బంగారం' సినిమాతో వచ్చి రూ.100 కోట్లకు పైగా వసూళ్లని అందుకుంది. దీని రిలీజ్ టైంలో సామ్ ప్రెగ్నెంట్ అయిందనే సంగతి బయటకొచ్చింది. ఈ డిసెంబరులోనే బిడ్డ పుట్టే అవకాశముందని తెలుస్తోంది.

Videos

పోతిరెడ్డిపాడు వద్ద హైటెన్షన్ YSRCP నేతలను అడ్డుకున్న పోలీసులు

1500 మంది నకిలీ అభ్యర్థులు పూర్తి ఆధారాలతో జడ శ్రవణ్ సంచలన వీడియో

సూర్య సినిమాకు భారీ ఓపెనింగ్స్ పాన్ ఇండియా వసూళ్లే టార్గెట్!

దమ్ముంటే చర్చకు రా.. కూన రవికి చింతాడ రవికుమార్ సవాల్

VIdeo: ఇలా కూడా బ్యాంక్ దోచేస్తారా?

YSRCP నేతలతో గుడివాడ అమర్నాథ్ అత్యవసర మీటింగ్

దుమ్మురేపుతున్న సామ్సంగ్.. ఫోల్డబుల్ ఫోన్ లో ఏది బెస్ట్

ప్రభుత్వ స్కూల్ లో దారుణం 9వ తరగతి విద్యార్థినిపై టీచర్....

ప్రియాంక చనిపోక ముందు రోజు... డాక్టర్ ప్రియాంక తండ్రి ఎమోషనల్ వీడియో

స్టార్టింగ్ లోనే భారీ షాక్.! చరణ్ కాదు కృష్ణుడు అవుట్?

Photos

+5

హైదరాబాద్ లో ఆకట్టుకున్న వెరైటీ గణనాథులు (ఫొటోలు)

+5

'ఇరుముడి' సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి కృతి శెట్టి (ఫొటోలు)

+5

పుట్టినరోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియ శరణ్‌ (ఫొటోలు)

+5

కేరళ కుట్టీలా మారిపోయిన 'ధురంధర్' భామ.. (ఫొటోలు)

+5

చీరలో నాజూగ్గా నభా నటేశ్.. (ఫొటోలు)

+5

సౌండ్ బాక్స్‌తో గ్లామరస్ శ్రుతి హాసన్.. (ఫొటోలు)

+5

కామాఖ్య దేవాలయాన్ని దర్శించుకున్న ఉపాసన.. (ఫొటోలు)

+5

'ఖైదీ' పాప ఇప్పుడెలా ఉందో చూశారా? ఏడేళ్ల తర్వాత మళ్లీ కలిశారు (ఫొటోలు)

+5

ఆదిలాబాద్ జిల్లాలో పోలాల అమావాస్య వేడుకలు...(ఫొటోలు)