Breaking News

ఆన్‌లైన్‌ హింసను అరికట్టాలి

Published on Thu, 11/27/2025 - 03:54

‘‘మనం హింస గురించి ఆలోచించినప్పుడు వీధుల్లో, ఇంట్లో, పని ప్రదేశాల్లో జరుగుతుందనుకుంటాం. కానీ, ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కూడా జరుగుతోంది. ప్రతి ముగ్గురిలో ఒక మహిళ హింసని ఎదుర్కొంటోంది’’ అని పేర్కొన్నారు సమంత. 

మహిళలపై పెరుగుతోన్న ఆన్‌లైన్‌ వేధింపులకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితితో కలిసి పని చేయనున్నారామె. మహిళల గౌరవాన్ని కాపాడటం అందరి బాధ్యత అంటూ యూఎన్‌ విమెన్‌ ఇండియా నిర్వహిస్తున్న ‘నో ఎక్స్‌క్యూజ్‌’ కార్యక్రమానికి సమంత మద్దతుగా నిలిచారు. నవంబరు 25న ప్రారంభమైన ఈ కార్యక్రమం డిసెంబర్‌ 10 వరకు జరగనుంది. ‘‘సోషల్‌ మీడియాలో కామెంట్స్, ఆన్‌లైన్‌ బెదిరింపులు, డీప్‌ ఫేక్‌ ఫొటోలు వంటివన్నీ జరుగుతున్నాయి. 

ఇవి మహిళలు నలుగురిలో తమ గొంతు వినిపించడానికి కూడా భయపడేలా చేస్తున్నాయి... అభద్రతాభావాన్ని కలిగిస్తున్నాయి. నేను ఎన్నోసార్లు ఈ పరిస్థితిని అనుభవించాను. వేధింపుల వల్ల చాలామంది మహిళల జీవితాలు, కెరీర్‌ ఆగిపోయాయి. ఆన్‌లైన్‌లో అబ్యూజ్‌ చేయడాన్ని జోక్‌గా ట్రీట్‌ చేయడం ఆపేస్తే మనం ఇంటర్నెట్‌ని బెటర్‌గా మార్చొచ్చు. ఆన్‌లైన్‌ హింసను అరికట్టడానికి మరింత బలమైన వ్యవస్థలు రావాలి. ఇది మహిళలకు భద్రతగా మారుతుంది. ఇలాంటి వాటిపై మహిళల్లో అవగాహన పెరగాలి’’ అని సమంత పేర్కొన్నారు.  


 

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)