Breaking News

పెళ్లి బంధానికి పూర్తి న్యాయం చేశా.. కానీ!

Published on Sat, 08/10/2024 - 10:56

సమంత ఇప్పుడేం సినిమా చేయట్లేదు. కానీ సోషల్ మీడియాలో గత రెండు రోజుల నుంచి ట్రెండింగ్ అవుతోంది. దీనికి కారణం నాగచైతన్య ఎంగేజ్‌మెంట్. ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతూ-సమంత.. 2021లో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఏదో సందర్భంలో వీళ్ల డివోర్స్ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఇప్పుడు చైతన్య, శోభితతో నిశ్చితార్థం చేసుకోవడంతో సమంత పాత వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: నిన్న ఎంగేజ్‌మెంట్.. ఇ‍ప్పుడు పెళ్లిలో కనిపించిన నాగచైతన్య)

'ఏ మాయ చేశావె' సినిమాతో చైతూ-సమంత ఒకరికొకరు పరిచయం. కొన్నాళ్లకు స్నేహం కాస్త ప్రేమగా మారింది. కుటుంబాల్ని ఒప్పించి 2017లో ఒక్కటయ్యారు. కానీ నాలుగేళ్లకే వీరి పెళ్లి పెటాకులైంది. కారణం ఏంటనేది పక్కనబెడితే విడాకులు తర్వాత సమంత పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది. తాను 'పుష్ప'లో ఐటమ్ సాంగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అందరూ ఏమన్నారో చెప్పుకొచ్చింది. ఇంతకీ సమంత అప్పుడు ఏమని చెప్పిందంటే?

'విడిపోయిన తర్వాత నా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు.. ఇప్పుడెందుకు ఐటమ్ సాంగ్ చేస్తున్నావ్, వద్దు ఇంట్లో కూర్చో అని అన్నారు. చాలా విషయాల్లో ప్రోత్సాహించే నా స్నేహితులు కూడా ఐటమ్ సాంగ్ వద్దంటే వద్దని అన్నారు. ఇదంతా విన్న తర్వాత.. అసలు నేనెందుకు దాక్కోవాలి? నేనేం తప్పు చేయలేదుగా, పెళ్లి అనే బంధానికి పూర్తిగా న్యాయం చేశా. కానీ వర్కౌట్ కాలేదు. అంతమాత్రన నేను చేయని తప్పునకు గిల్టీగా ఫీలై, నన్ను నేనే బాధపెట్టుకోలేనుగా' అని సమంత చెబుతున్న పాత వీడియో ఒకటి మళ్లీ వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: చైతూ- శోభిత తొలిసారి అక్కడే కలుసుకున్నారా?)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)