Breaking News

మహిళల శరీరాలు ఎంతో విలువైనవి.. సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Tue, 05/02/2023 - 13:24

మహిళల డ్రెస్‌ కోడ్‌ కాంట్రవర్సీపై బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ స్పందించారు. మహిళల శరీరాలు ఎంతో విలువైనవని ,వాటిని ఎంత ఎక్కువ దుస్తులతో సంరక్షిస్తే వారికి అంత మంచిదని వ్యాఖ్యానించారు. ఆదివారం ప్రసారమైన ‘ఆప్‌ కీ అదాలత్‌’ టీవీ కార్యక్రమంలో సల్మాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

అసలు డ్రేస్‌ కోడ్‌ వివాదమేంటి?
కిసీ కా భాయ్.. కిసీ కా జాన్ సినిమాలో సల్మాన్‌తో కలిసి నటించిన పాలక్‌ తివారీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘సల్మాన్‌ ఖాన్‌ తన సినిమా సెట్‌లో ఉన్న మహిలందరూ నిండుగా, మెడ వరకు వస్త్రాలు ధరించేలా చూస్తారు’ అని పేర్కొంది.  దీనిని నెటిజన్స్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. సల్మాన్‌ను విమర్శిస్తూ ట్వీట్స్‌ చేశారు.

(చదవండి: మే తొలివారం థియేటర్‌/ ఓటీటీలో అలరించే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లివే )

అందుకే ఆ కండీషన్‌ పెట్టా: సల్మాన్‌
తాజాగా ఆప్‌ కీ అదాలత్’ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్‌ను వ్యాశ్యాత రజత్‌ శర్మ  ఓ ప్రశ్న అడిగారు.  ‘మీ సినిమా సెట్‌లోని మహిళలకు దుస్తుల విషయంలో నియమం పెట్టిన మీరు.. సినిమాల్లో మాత్రం చొక్కా విప్పి నటిస్తారు కదా. ఇది ద్వంద్వ ప్రమాణాల కిందికి రాదా?’ అంటూ ప్రశ్నించారు. 

(చదవండి: నా జీవితంలో ఎలాంటి బాధలు లేవు.. కానీ ఆ ఒక్క విషయంలోనే: నాగ చైతన్య )

దీనికి సల్మాన్ ఖాన్ జవాబిస్తూ ఇందులో ద్వంద్వ ప్రమాణాలు ఏమీ లేవు. మహిళలు శరీర భాగాలు చాలా విలువైనవి అన్నదే నా అభిప్రాయం.  వాటిని ఎంత ఎక్కువ దుస్తులతో సంరక్షిస్తే అంత మంచింది. ఇది మహిళల గురించి చెబుతున్న మాట కాదు,  మన తల్లులు, సోదరీమణులూ, భార్య వంటి మహిళలను వక్రబుద్ధి తో చూసే కొందరిని ఉద్దేశించి చెబుతున్న మాట. దుస్తుల కారణంగా మహిళలు అవమానాలకు గురి కాకూడదని నేను కోరుకుంటున్నాను’ అని సల్మాన్‌ వివరించారు. 

నా చుట్టూ ఎన్నో తుపాకులు ఉన్నాయి
ఇదే కార్యకమ్రంలో తనకు వస్తున్న బెదిరింపులపై కూడా సల్మాన్‌ స్పందించారు. బెదిరింపుల కారణంగా తనకు భద్రత పెంచారని, దీంతో గతలో మాదిరి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లలేకపోతున్నానని అన్నాడు. ‘ట్రాఫిక్‌లోనూ నా చుట్టు సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. అది ఇతరులకు అసౌకర్యంగా ఉంటుంది. ఏది జరగాలో అదే జరుగుతుంది. భగవంతుడిపై భారం వేశా. ఇప్పుడు నా చుట్టూ ఎన్నో తుపాకులు ఉన్నాయి. వాటిని చూసి భయపడుతున్నా. చాలా జాగ్రత్తగా ఉంటున్నా’ అని సల్మాన్‌ చెప్పుకొచ్చాడు. 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)