Breaking News

'రష్మిక కూతురితో కూడా పని చేస్తా'.. ట్రోల్స్‌పై సల్మాన్ ఖాన్ దిమ్మదిరిగే కౌంటర్

Published on Sun, 03/23/2025 - 21:09


బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌, పుష్ప బ్యూటీ రష్మిక మందన్నా జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ సికందర్. ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్, సల్మాన్ ఫిల్మ్ ఖాన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై  సాజిద్‌ నదియావాలా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఉగాది కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ సికందర్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ట్రైలర్ లాంఛ్‌ ఈవెంట్‌కు హాజరైన సల్మాన్ ఖాన్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించారు. తనతో నటిస్తోన్న హీరోయిన్లతో వయస్సు అంతరంపై ప్రశ్నించగా.. తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు. నాకు, హీరోయిన్‌కి మధ్య 31 ఏళ్ల వయస్సు గ్యాప్ ఉందని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.. హీరోయిన్ రష్మికకు, ఆమె తండ్రికి నా వయస్సుతో ఎలాంటి సమస్య లేదు.. మీకేంటి ప్రాబ్లమ్‌  అన్నయ్యా? అంటూ ఫన్నీగా ఆన్సరిచ్చారు. భవిష్యత్తులో రష్మికకు కూతురు పుడితే తనతో కూడా కలిసి పనిచేస్తా అని అన్నారు.  రష్మిక అనుమతి తీసుకుంటానని నవ్వుతూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

(ఇది చదవండి: సల్మాన్ ఖాన్ యాక్షన్ థ్రిల్లర్‌.. ట్రైలర్‌ వచ్చేసింది)

కాగా.. ఆదివారం ముంబయిలో ఏర్పాటు చేసిన గ్రాండ్‌ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో సికందర్ ట్రైలర్  రిలీజ్‌ చేశారు. ఈ సినిమా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్, శర్మన్ జోషి, ప్రతీక్ బబ్బర్ కీలక పాత్రల్లో నటించారు.
 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)