Breaking News

సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు.. రూ.5 కోట్లు ఇస్తేనే

Published on Fri, 10/18/2024 - 10:23

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఇప్పటివరకు చంపుతామని బెదిరించిన బిష్ణోయ్ గ్యాంగ్ కాస్త ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే ఇది కొత్త ట్విస్ట్ అని చెప్పాలి. ఇంతకీ అసలేం జరుగుతోంది?

కొన్నిరోజుల క్రితం మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ దారుణానికి పాల్పడింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అని తేలింది. సల్మాన్‌కి స్నేహితుడు అయినందుకే ఇలా చేసినట్లు అనుమానిస్తున్నారు. తాజాగా సల్మాన్‌కి మరోసారి బెదిరింపులు వచ్చాయి. రూ.5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్‌ను చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మెసేజ్‌ను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. బిష్ణోయ్‌తో శతృత్వం ఆగాలన్నా, సల్మాన్‌ బతికుండాలన్నా ఐదు కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)

ఈ మెసేజ్ ఎవరు పంపించారా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. 1999లో కృష్ణ జింకల్ని వేటాడిన తర్వాత కొన్నాళ్ల పాటు సల్మాన్ జైలు జీవితం గడిపాడు. ఈ సంఘటనతో సల్మాన్‌పై బిష్ణోయ్ తెగకు చెందిన లారెన్స్ పగ పెంచుకున్నాడు. చాన్నాళ్ల నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి.

2022లోనూ బాంద్రాలోని సల్మాన్ ఇంటి దగ్గర అనుమానాస్పద రీతిలో ఉత్తరం దొరికింది. 2023లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి స్వయంగా సల్మాన్‌కే మెయిల్ వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇద్దరు వ్యక్తులు.. ఏకంగా సల్మాన్ ఫామ్ హౌస్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బాబా సిద్దిఖీని చంపేయడంతో సల్మాన్‌కి పోలీసులు మరింత భద్రత పెంచారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కానీ!)

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు