Breaking News

హాలీవుడ్‌ ఎంట్రీ

Published on Sat, 02/22/2025 - 03:19

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోలుగా క్రేజ్‌ సొంతం చేసుకున్న సల్మాన్‌ ఖాన్(Salman Khan), సంజయ్‌ దత్‌(Sanjay Dutt) హాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. లూయిస్‌ మచిన్, ఎవా బియాంకో, పౌలా లుస్సీ ప్రధాన పాత్రల్లో రోడ్రిగో గెర్రెరో దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సెవెన్‌ డాగ్స్‌’.  2021లో అర్జెంటీనాలో విడుదలైన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ మూవీని హాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నారు.

ఈ రీమేక్‌లో సల్మాన్‌ ఖాన్, సంజయ్‌ దత్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. సల్మాన్, సంజయ్‌లపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షూటింగ్‌ వీడియో క్లిప్పింగ్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. సల్మాన్‌ ఖాకీ చొక్కా వేసుకుని ఆటో డ్రైవర్‌ వేషంలో ఉండగా... సంజయ్‌ సూటు ధరించి ఉన్నారు.

మిడిల్‌ ఈస్ట్‌లో జరిగే అమెరికన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందట. మిడిల్‌ ఈస్ట్‌లో సల్మాన్‌ ఖాన్, సంజయ్‌ దత్‌ సినిమాలకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ రీమేక్‌లో నటింపజేస్తున్నారట హాలీవుడ్‌ మేకర్స్‌. అయితే భద్రతా కారణాల రీత్యా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను అధికారికంగా వెల్లడించలేదు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)