Breaking News

టైగర్‌తో జైలర్‌.. సెట్‌ చేస్తున్న టాప్‌ డైరెక్టర్‌

Published on Tue, 06/25/2024 - 08:48

ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద సంచలనాలు క్రియేట్‌ చేసేందుకు కోలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ అట్లీ భారీ స్కెచ్‌ వేస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది షారుఖ్‌ ఖాన్‌తో జవాన్‌ తీసి హిట్‌ కొట్టిన ఆయనకు బాలీవుడ్‌లో కూడా క్రేజ్‌ పెరిగింది. అయితే, ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి ప్రాజెక్ట్‌ ప్రకటించలేదు. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో ఒక సినిమా తీయబోతున్నట్లు వార్తలు వచ్చాయి కానీ, ప్రకటన మాత్రం రాలేదు. ఇప్పుడు సల్మాన్‌ ఖాన్‌తో అట్లీ ప్లాన్‌ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

జవాన్‌ సినిమా తర్వాత మళ్లీ బాలీవుడ్‌లోనే ఒక భారీ ప్రాజెక్ట్‌ చేయనున్నాడు అట్లీ. ఈమేరకు వార్తలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి.  సల్మాన్‌ ఖాన్‌తో ఓ మల్టీస్టారర్‌ చేసేందుకు కథను కూడా ఆయన ఫిక్స్‌ చేశారట. అయితే, ఈ సినిమాలో సౌత్‌ ఇండియా టాప్‌ హీరోను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కథలో కీలకంగా ఉండే ఆ పాత్ర కోసం రజనీకాంత్‌ను ఎంపిక చేస్తే బాగుంటుందని అట్లీ కోరుతున్నాడట. ప్రస్తుతం ఈ విషయం గురించి రజనీతో కూడా ఆయన చర్చలు జరిపినట్లు తెలిసింది. 

సన్‌పిక్చర్స్‌ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రంలో ఇద్దరు సూపర్‌స్టార్స్‌ను దృష్టిలో పెట్టుకొని అట్లీ కథను రెడీ చేశారట. ఇప్పటికే ఈ చిత్ర స్క్రిప్ట్‌ పనులు కూడా ముగింపు దశకు చేరుకున్నాయట. వచ్చే ఏడాదిలో సినిమాని పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌ ‘సికందర్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మురుగదాస్‌ దర్శకుడు. రజనీకాంత్‌ నటించిన 'వేట్టయాన్‌' విడుదలకు సిద్ధంగా ఉంటే.. లోకేష్‌ కనగరాజ్‌ డైరెక్షన్‌లో రానున్న 'కూలీ' చిత్రీకరణ ప్రారంభించుకోవాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌ల తర్వాత అట్లీ సినిమా ప్రారంభం అవుతుందని సమాచారం.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)