Breaking News

'సలార్' కలెక్షన్స్ రచ్చ.. రెండు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లు

Published on Sun, 12/24/2023 - 14:38

సలారోడు.. బాక్సాఫీస్‌ని ఊచకోత కోస్తున్నాడు. ప్రభాస్ దెబ్బకు ఫ్యాన్స్ మాస్ జపం చేస్తున్నారు. దీనికి తగ్గట్లే కలెక్షన్స్ దుమ్మురేపుతున్నాయి. అయితే తొలిరోజు వసూళ్లతో పలు రికార్డులు సెట్ చేసిన 'సలార్'.. రెండోరోజుకి కాస్త నెమ్మదించింది. ఇంతకీ రెండు రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని డబ్బలు వచ్చాయి? అసలేం జరుగుతోంది?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ హిట్ మూవీ.. రెండు నెలల తర్వాత ఇప్పుడు స్ట్రీమింగ్‌)

డార్లింగ్ ప్రభాస్ చాలా ఏళ్ల తర్వాత చేసిన మాస్ మూవీ 'సలార్'. పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ప్రభాస్ నుంచి 'సాహో' లాంటి మాస్ చిత్రం వచ్చింది. కానీ ఎందుకో ఇది అభిమానుల్ని సంతృప్తి పరచలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' ఆడియెన్స్‌ని ఆకట్టుకోవడంలో ఫెయిలయ్యాయి. ఇప్పుడు వీళ్లందరినీ 'సలార్' ఫుల్ సాటిస్పై చేస్తోంది. అందుకు తగ్గట్లే కలెక్షన్స్ వస్తున్నాయి.

టాక్‌‌తో సంబంధం లేకుండా తొలిరోజు రూ.178.7 కోట్లు వసూలు చేసిన సలార్.. రెండో రోజు పూర్తయ్యేసరికి 295.7 కోట్ల వసూళ్లు సాధించింది. అంటే తొలిరోజుతో పోలిస్తే శనివారం కలెక్షన్స్ కాస్త తగ్గాయి. సరిగా చెప్పాలంటే రెండో రోజు మాత్రం రూ.117 కోట్ల వరకు ప్రపంచవ్యాప్తంగా సొంతం చేసుకుంది. ఆదివారం కూడా 100 కోట్ల తగ్గకుండా వస్తాయి. వచ్చే వారం పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు కాబట్టి త్వరలో రూ.1000 కోట్ల మార్క్ దాటేసినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

(ఇదీ చదవండి: 'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!)

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)