Breaking News

సాక్షి ధోని నిర్మాతగా లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌.. పోస్టర్‌ చూశారా?

Published on Thu, 06/01/2023 - 15:23

కుటుంబ నేపథ్యంలో రూపొందే ఫీల్‌ గుడ్‌ కథా చిత్రాలకు ప్రేక్షకుల మధ్య ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అలాంటి కథా చిత్రమే లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌. సినిమా పేరు కొత్తగా ఉందనుకుంటున్నారా? ఇప్పటి వరకు ఎల్‌జీఎం పేరుతో ప్రచారంలో ఉన్న చిత్రం పూర్తి పేరు లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌. ప్రముఖ భారతీయ క్రికెట్‌ క్రీడాకారుడు ఎంఎస్‌ ధోని సమర్పణలో ఆయన సతీమణి సాక్షి ధోని చిత్ర నిర్మాణం రంగంలోకి ప్రవేశించి నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది.

నటుడు హరీష్‌ కల్యాణ్‌, నటి నదియ, యువనా, యోగిబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా రమేష్‌ తమిళమణి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా చిత్రం షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. తాజాగా సెకండ్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

దీనికి మంచి స్పందన వస్తుందని చిత్ర వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. చిత్ర షూటింగ్‌ ప్రణాళిక ప్రకారం పూర్తి చేసినట్లు నిర్మాత సాక్షి ధోని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇది మంచి ఫీల్‌గుడ్‌ మూవీగా ఉంటుందని చెప్పారు. చక్కని వినోదంతో అనుబంధాలను ఆవిష్కరించే మంచి కుటుంబ కథా చిత్రంగా ఎల్‌జీఎం చిత్రం ఉంటుందని తెలిపారు. ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)