Breaking News

పిరియడ్స్‌లోనూ ‘హాఫ్ ఐరన్‌మ్యాన్’.. రికార్డు సృష్టించిన నటి

Published on Sat, 07/12/2025 - 12:23

కొంతమంది తారలు నటనతో ఆకట్టకుంటూనే అప్పుడప్పుడు తమలోని అసాధరణమైన నైపుణ్యాన్ని బయటిప్రపంచానికి చూపించి.. ఆశ్చర్యపరుస్తుంటారు. కేవలం సినిమా రంగంలోనే కాకుండా..ఇతర రంగాలలోనూ తన టాలెంట్‌ని నిరూపించుకొని ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి సయామీ ఖేర్(Saiyami Kher )‌ ఒకరు. తనదైన నటనతో అటు బాలీవుడ్‌, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ.. క్రీడల్లోనూ రాణిస్తోంది. ఇటీవల ‘ఐరన్‌మ్యాన్‌ 70.3’ అనే ట్రయాథ్లాన్‌ను పూర్తిచేసి..ఒకే ఏడాదిలో రెండు సార్లు ఈ రేసుని పూర్తి చేసిన తొలి భారతీయ నటిగా రికార్డు సృష్టించింది. అయితే ఈ సారి ఆమె పిరియడ్స్‌లో ఉన్నప్పుడు ఈ ఘనత సాధించడం గమనార్హం.

ఏమిటీ ‘ఐరన్‌ మ్యాన్‌70.3’ 
‘ఐరన్‌మ్యాన్‌ 70.3’ అనేది ఒక ప్రముఖ ట్రయాథ్లాన్ రేసు, ఇది ఐరన్‌మ్యాన్ సిరీస్‌లో భాగం. దీనిని "హాఫ్ ఐరన్‌మ్యాన్" అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది పూర్తి ఐరన్‌మ్యాన్ రేస్ దూరంలో సగం ఉంటుంది. ఈ రేస్ మూడు ఈవెంట్‌లను కలిగి ఉంటుంది. తొలుత 1.9 కిలోమీటర్లు (1.2 మైళ్లు) ఈత కొట్టాలి. తర్వాత 90 కిలో మీటర్లు(56 మైళ్లు) సైక్లింగ్‌ చేయాలి. ఆ తర్వాత 21.1(13.1 మైళ్లు) కిలోమీటర్లు పరుగెత్తాలి. మొత్తం దూరం 113 కిలోమీటర్లు(70.3 మైళ్లు). అందుకే దీన్నీ ఐరన్‌ మ్యాన్‌ 70.3 అని పిలుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో నిర్వహించబడుతుంది. జులై 6న స్వీడన్‌లోని జోంకోపింగ్‌లో నిర్వహించిన ఈ రేస్‌లో సయామీ ఖేర్‌ పాల్గొని పతాకాన్ని సాధించిది. గతేడాది సెప్టెంబర్‌లో తొలిసారిగా మెడల్‌ అందుకున్న సయామీ.. ఇప్పుడు స్వీడన్‌లో నిర్వహించిన రేస్‌లో సత్తా చాటి మరో పతకం అందుకుంది.

నెలసరి సమస్యను అధిగమించి.. 
నాకు పీసీఓఎస్‌(పాలిసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌) ఉంది. దీని వల్ల రుతుక్రమం సరిగ్గా కాదు. రేసులో పాల్గొనే వారంలోనే నాకు పిరియడ్స్‌ మొదలయ్యాయి. అదృష్టవశాత్తు నా పీరియడ్స్‌ చివరి రోజు రేసులో పాల్గొన్న కాబట్టి నొప్పి అంతగా లేదు. కానీ సాధారణ రోజుల కంటే ఆ సమయంలోనే నాకు కాస్త అసౌకర్యంగానే అనిపించింది. మానసికంగా కొంత కలవరపెట్టింది. చాలా మంది మహిళలు పీరియడ్స్‌ ఉన్నప్పుడు కూడా ఉద్యోగానికి, ఇతర పనులకు హాజరవుతుంటారు. అసౌకర్యంలోనూ మనం ఎలా ముందుకు సాగాలో వారి నుంచి నేర్చుకోవచ్చు. నేను కూడా నెలసరి సమస్యను అధిగమించి గత పోటీ కంటే ఈ సారి 32 నిమిషాల ముందే రేసుని పూర్తి చేశాను’ అని సయామీ ఓ నేషనల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.

సయామీ సీనీ నేపథ్యం
నాసిక్‌కి చెందిన సయామీ.. ‘రేయ్‌’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి.. అక్కడ వరుస సినిమాలతో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. చాలా కాలం తర్వాత ‘వైల్డ్‌ డాగ్‌‌’ సినిమాతో మళ్లీ టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించింది. ఇటీవల వచ్చిన హిందీ చిత్రం ‘జాబ్‌’లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం హిందీ, మరాఠీ చిత్రాలతో బీజీగా అయింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)