Breaking News

ప్రపంచంలోనే ఏఆర్‌ అత్యుత్తమ వ్యక్తి: సైరా భాను

Published on Mon, 11/25/2024 - 03:58

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్ , ఆయన భార్య సైరా భాను విడాకుల వ్యవహారంపై రకరకాల ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. 29 ఏళ్లు అన్యోన్యంగా సంసార జీవితాన్ని సాగించిన ఈ జంట విడిపోవాలనుకోవడానికి గల కారణాలను నెటిజన్లు పెద్ద ఎత్తున వెతుకుతున్నారు. ఏఆర్‌ రెహమాన్  వద్ద చాలా కాలంగా పని చేస్తున్న గిటారిస్ట్‌ మోనికా దేను కూడా ఈ వివాదంలోకి లాగుతున్నారు.

దీంతో తన గురించి అసత్య ప్రచారాన్ని చేస్తున్న సామాజిక మాధ్యమాలకు రెహమాన్  తన న్యాయవాది ద్వారా నోటీసులు జారీ చేశారు. ఆదివారం సైరా భాను ‘నేను సైరా రెహమాన్‌ మాట్లాడుతున్నా’ అంటూ ఓ వీడియో వాయిస్‌ను విడుదల చేశారు. అందులో ‘‘ఏఆర్‌ గురించి దయచేసి అసత్య ప్రచారం చేయకండి. ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యక్తి ఆయన. అలాంటి అద్భుతమైన మనిషిని చూడలేం. నా శారీరక అనారోగ్యం కారణంగా కొన్ని నెలలుగా ముంబైలో ఉంటూ, చికిత్స పొందుతున్నాను.

అందువల్లే ఏఆర్‌ నుంచి కొంతకాలం బ్రేక్‌ తీసుకోవాలనుకున్నా. విడిపోవాలనుకోవడానికి కారణం నా అనారోగ్యమే. ఏఆర్‌ రెహమాన్  ఎంతో బిజీగా ఉన్న పరిస్థితుల్లో ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. నా పిల్లలనూ ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. ఏఆర్‌పై నాకున్న నమ్మకం నా జీవితానికంటే పెద్దది. నేను ఆయన్ని ఎంతగా ప్రేమించానో చెప్పడానికి ఇదే నిదర్శనం. నన్ను కూడా ఆయన అంతే ప్రేమించారు. ఇంకా ఏదీ అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి ఈ పరిస్థితుల్లో మా స్వేచ్ఛను గౌరవించండి. చికిత్స పూర్తయ్యాక త్వరలోనే చెన్నైకి తిరిగి వస్తాను. ఏఆర్‌ రెహమాన్  పేరుకు దయచేసి కళంకం ఆపాదించకండి’’ అని సైరా భాను కోరారు.         – సాక్షి చెన్నై, తమిళ సినిమా 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)