Breaking News

‘సైంధవ్‌’ కోసం ‘ఇంద్రప్రస్థ’ అనే ఫిక్షనల్ టౌన్: డైరెక్టర్‌

Published on Wed, 01/10/2024 - 10:29

‘‘ఓ ప్రాసెస్‌ను ఫాలో అవుతూ నిజాయితీగా సినిమా తీస్తే, ఆ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతాను. ‘సైంధవ్‌’ను కూడా ఇలాగే తీశాను. ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. అలాగే జయాపజయాల గురించి ఆలోచించే మనస్తత్వం నాకు లేదు. నా ప్రయాణాన్ని ఆస్వాదిస్తాను’’ అన్నారు శైలేష్‌ కొలను. వెంకటేశ్‌ హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన  చిత్రం ‘సైంధవ్‌’. వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశంలో శైలేష్‌ కొలను చెప్పిన విశేషాలు.

► ‘హిట్‌ 2’ రిలీజ్‌ తర్వాత నిర్మాత వెంకట్‌గారు చెప్పారని వెంకటేశ్‌గారిని కలిశా. ఆయన్ను కలిసిన తొలిసారి మేం సినిమాలు కాకుండా జీవిత విశేషాలను మాట్లాడుకున్నాం. అలా రెండు మూడుసార్లు కలుసుకున్నాక ఓ సందర్భంలో ఆయనకు ‘సైంధవ్‌’ స్టోరీ లైన్‌ చెప్పాను. ఆ తర్వాత పూర్తి కథ చెప్పా. ‘ఈ స్క్రిప్ట్‌ నా 75వ సినిమాకు సరిపోతుందనిపిస్తోంది. ఈ సినిమా చేద్దాం’ అన్నారు. వెంకటేశ్‌గారి అనుభవం, ఆయన సూచనలు, సలహాలు తీసుకుని ‘సైంధవ్‌’ స్క్రిప్ట్‌ను మరింత బాగా రెడీ చేశాను. అలాగే  వెంకటేశ్‌గారు చెప్పారని, సురేష్‌బాబుగారికి కూడా కథ వినిపించాను. ఆయన కొన్ని ఇన్‌పుట్స్‌ ఇచ్చారు

► దర్శకుడిగా నేను తొలుత ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్స్‌ చేశాను. కానీ ‘సైంధవ్‌’ ఎమోషనల్‌ డెప్త్‌ ఉన్న ఫిల్మ్‌. స్పైనల్‌ మస్కులర్‌ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన చిన్నారి కుమార్తె గాయత్రిని (సారా పాత్ర)ని తండ్రిగా సైంధవ్‌ (వెంకటేశ్‌ పాత్ర) ఏ విధంగా కాపాడుకుంటాడు? గాయత్రికి కావాల్సిన రూ. 17 కోట్ల ఖరీదైన ఇంజక్షన్‌ కోసం ఏ విధంగా పోరాటం చేస్తాడు? అనేది ఈ చిత్రకథ. వెంకటేశ్‌గారి పాత్రకు ఫ్లాష్‌బ్యాక్‌ స్టోరీ ఉంటుంది. కానీ రొటీన్‌గా ఉండదు. ఎంత కొత్తగా డిజైన్‌ చేశానన్నది థియేటర్స్‌లో చూస్తారు.

► డ్రగ్ కార్టేల్స్, గన్ బిజినెస్..ఇలా పెద్ద స్కేల్ లో ఇందులో కథ జరుగుతుంటుంది. ఈ కథ సముద్రతీరంలో జరగాలి. వైజాగ్ లో ఇంత పెద్ద కార్యకలాపాలు జరుగుతాయంటే నమ్మశక్యంగా ఉండదు. ముంబైలో పెట్టుకుంటే నేటివిటీ పోతుంది. అందుకే ‘ఇంద్రప్రస్థ’ అనే ఫిక్షనల్ టౌన్ ని క్రియేట్ చేశాం. మేజర్‌గా నైట్‌ షూట్‌ చేయాల్సి వచ్చింది. నైట్‌ షూట్స్‌ అని వెంకటేశ్‌గారికి ముందే చెప్పాను. బాగా సపోర్ట్‌ చేశారు. ‘సైంధవ్‌’ను ప్రేక్షకులు సపోర్ట్‌ చేస్తే పార్ట్‌ 2 చేసే స్కోప్‌ కథలో ఉంది.

► థ్రిల్లర్స్, యాక్షన్‌ చిత్రాలే కాదు.. ఓ దర్శకుడిగా అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది. నాది ప్రేమ వివాహం. నా జీవితంలో జరిగిన లవ్‌ మూమెంట్స్‌ను ఓ కథగా రాశాను. తప్పకుండా ఈ సినిమా చేస్తాను. అలాగే నానీగారితో ‘హిట్‌ 3’ ఉంటుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)