'ఆదిపురుష్'-కొడుక్కి క్షమాపణ.. మాట మార్చేసిన సైఫ్

Published on Mon, 05/05/2025 - 17:55

ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్'.. థియేటర్లలో రిలీజై ఓటీటీలోకి వచ్చినప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇదంతా రెండేళ్ల కిందటి ముచ్చట. మళ్లీ కొన్నిరోజుల క్రితం నుంచి ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. తన సినిమా ఫ్లాప్ కాదని దర్శకుడు ఓం రౌత్ వాదించడం, ఈ మూవీలో నటించినందుకు కొడుక్కి సారీ చెప్పానని సైఫ్ అలీ ఖాన్ అనడం పెద్ద చర్చకు దారితీసింది.

కొడుకు తైమూర్‌కు 'ఆదిపురుష్' సినిమా చూపించానని, అతడిలో ఏ స్పందన లేకపోయేసరికి సారీ చెప్పానని సైఫ్ అన్నాడు. ఆల్రెడీ ఫ్లాప్ అయిన సినిమా గురించి మళ్లీ మళ్లీ ఎందుకు ఇలా అంటున్నారని ప్రభాస్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. నటుడు సైఫ్ అలీ ఖాన్ వ్యాఖ‍్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడీ నటుడు మాట మార‍్చేశాడు. 

(ఇదీ చదవండి: స్నానం కూడా చేయలేదు.. అమ‍్మ జీవితాంతం నన్ను..: రష్మీ) 

'నేను ఆదిపురుష్ మూవీలో విలన్ గా నటించాను. అందులో కేకలు వేస్తూ అందరితో యుద్ధం చేస్తుంటాను. అది చూసి ఈసారి ఇలాంటి సినిమాలో హీరోగా చేయమని అన్నాడు. దీంతో ఓకే చెప్పాను. విలన్ గా నటించినందుకు సారీ చెప్పాను. నేను పనిచేసిన అన్ని చిత్రాల్ని గౌరవిస్తాను. ఆదిపురుష్ ని కూడా అలానే చూస్తాను' అని సైఫ్ కవరింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.

ఆదిపురుష్ లో సైఫ్ రావణుడి పాత్ర చేశాడు. అయితే ఇతడి పాత్ర వేషధారణ నుంచి ట్రోలింగ్ మొదలైంది. తర్వాత లంకని గ్రాఫిక్స్ లో దారుణంగా చూపించడం, గబ్బిలాల్లాంటి పక్షులతో ఫైటింగ్.. ఇవన్నీ కూడా సగటు ప్రేక్షకుడికి చిరాకు తెప్పించాయి. దీంతో ఆదిపురుష్.. ఫెయిలైంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)