Breaking News

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ కానున్న సైఫ్‌.. బిల్‌ ఎంతో తెలుసా..?

Published on Tue, 01/21/2025 - 13:55

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ (Saif Ali Khan) ఆసుపత్రి నుంచి నేడు డిశ్చార్జ్‌ కానున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాడని  లీలావతి ఆసుపత్రి(Lilavati Hospital) వైద్యులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 2 తర్వాత ఆయన డిశ్చార్జ్‌ అవుతారని వారు తెలిపారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయని తెలిపారు. దాడిలో భాగంగా సైఫ్‌ వెన్నెముకకు తీవ్రగాయం అయింది. దీంతో సర్జరీ చేసిన వైద్యులు వెన్నెముక నుంచి కత్తిని తొలగించారు.

సైఫ్‌పై దాడి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ప్రధాన నిందితుడైన మహ్మద్‌ షరీఫుల్‌ ఇస్లాం షెహజాద్‌ను విచారించిన పోలీసులు  క్రైమ్‌సీన్‌ రీక్రియేషన్‌ కోసం నిందితుడిని సైఫ్‌ ఇంటి వద్దకు తీసుకెళ్లారు. నిందితుడి వేలిముద్రలను కూడా తీసుకున్నారు.  ఫోరెన్సిక్‌ అధికారులు కూడా సైఫ్‌ ఇంటికి వెళ్లి దాడి జరిగిన ప్రదేశంలో నిందితుడి వేలిముద్రలు గుర్తించారు. ఇదే విషయాన్ని ఒక అధికారి కూడా ప్రకటించారు. ఇంట్లోని కిటికీలతో పాటు లోపలికి వచ్చేందుకు ఉపయోగించిన నిచ్చెనపై కూడా నిందితుడి వేలిముద్రలు ఉన్నాయన్నారు.

(ఇదీ చదవండి: ప్రియురాలిని పెళ్లి చేసుకున్న ప్రముఖ దర్శకుడు)

ఈ నెల 16న సైఫ్‌ ఇంటికి చోరీకి వెళ్లిన   నిందితుడు మహ్మద్‌ షరీఫుల్‌  బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు ప్రకటించారు. దాడి తర్వాత తమ దేశానికి పారిపోయే ప్లాన్‌లో ఉండగా  పట్టుకున్నట్లు వారు తెలిపారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో సైఫ్‌ చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సైఫ్‌ పూర్తి ఆసుపత్రి బిల్‌ రూ. 40 లక్షలు దాటినట్లు తెలుస్తోంది. అయితే, ఆయనకు ఇన్సూరెన్స్‌ ఉండటం వల్ల సదరు కంపెనీ వాళ్లు   ఇప్పటి వరకు రూ.25 లక్షలు  చెల్లించినట్లు తెలుస్తోంది.

సైఫ్‌పై దాడి జరిగిన సమయంలో అతన్ని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ కూడా ఆ సమయంలో తండ్రితో పాటు ఉన్నాడు. అయితే, ఆటో డ్రైవర్ వారి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని తెలిపారు. కానీ, సైఫ్‌ను రక్షించినందుకు అతనికి ముంబయిలోని ఓ సంస్థ రూ.11 వేల రివార్డ్ ప్రకటించింది. సైఫ్‌ నేడు డిశ్చార్జ్‌ అయిన తర్వాత తనకు ఏమైనా సాయం చేయవచ్చని తెలుస్తోంది.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)