Breaking News

సైఫ్ అలీఖాన్ కత్తిపోటు కేసు.. బెయిల్‌ వద్దంటూ పోలీసులపై నిందితుడి ఆరోపణలు

Published on Sat, 05/10/2025 - 09:25

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై (Saif Ali Khan) ఈ ఏడాది ప్రారంభంలో దాడి జరిగిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు   బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను(30) అరెస్ట్‌ చేశారు. ఇప్పటికే అతనిపై కోర్టులో చార్జ్‌షీట్‌ను కూడా దాఖలు చేశారు. అయితే, తన అరెస్ట్‌ చట్టవిరుద్ధమని ప్రకటించాలని, తనను జైలు నుంచి వడుదల చేయాలని  మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును నిందితుడు ఆశ్రయించాడు. ఆపై ఏప్రిల్‌ నెలలో సెషన్స్‌ కోర్టులో దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కూడా అతను ఉపసంహరించుకున్నాడు.

ప్రస్తుతం ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న నిందితుడు మొహమ్మద్ తన న్యాయవాది అజయ్ గావ్లి ద్వారా, తన అరెస్టును చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరుతూ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (బాంద్రా) ముందు దరఖాస్తు చేసుకున్నాడు. ఆపై తనను జైలు నుండి విడుదల చేయాలని కోరాడు. ఆ పిటిషన్‌లో, పోలీసులు తనను అరెస్టు చేసేటప్పుడు చట్ట నిబంధనలను పాటించలేదన్నాడు. వారిపై మరికొన్ని ఆరోపణలు చేశాడు. దీంతో వాటికి సమాధానం చెప్పాలని పోలీసులను కోర్టు కోరింది. విచారణను మే 13కి వాయిదా వేసింది.

జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్‌ అలీఖాన్‌పై దాడి జరిగింది. అతని మెడపై కత్తిపోట్లు కూడా పడ్డాయి. దీంతో ఆసుపత్రిలో అత్యవసర శస్త్రచికిత్స తీసుకున్న ఆయన సుమారు ఐదు రోజుల తర్వాత  డిశ్చార్జ్ అయ్యారు. సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే అతడు సైఫ్‌ నివాసంలోకి వెళ్లాడని పోలీసులు గుర్తించారు.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)