Breaking News

కత్తితో దాడి.. నా కుమారుడి మాటలకు కన్నీళ్లు వచ్చాయి: సైఫ్‌ అలీఖాన్‌

Published on Mon, 02/10/2025 - 12:00

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌(Saif Ali Khan) దుండగుడి చేతిలో తీవ్రంగా గాయపడిన రోజు ఏం జరిగిందో మొదటిసారి ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. దొంగతనం కోసం వచ్చిన వ్యక్తితో తనను కత్తితో పొడిచిన సమయంలో తాను పెద్దగా కంగారుపడలేదని చెప్పారు. అయితే, కొంత సమయం తర్వాత ఎక్కువ నొప్పి రావడంతో ఆ గాయం తీవ్రత ఎంతో తెలిసింది. ఆ సమయంలో తన  కుమారుడు తైమూర్‌ మాటలను సైఫ్‌ గుర్తు చేసుకున్నారు.

'నాపై దాడి జరిగిన తర్వాత తీవ్రమైన నొప్పితో బాధపడ్డాను. నా వెన్నులో బలమైన కత్తితో దాడి చేశాడని తెలిసింది.  ఆ సమయంలో కరీనా చాలా కంగారు పడింది. ఏం చేయాలో తనకు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. మా కుటుంబ సభ్యలకు అందరికీ కాల్స్‌ చేస్తూ ఉంది. కానీ, అర్ధరాత్రి కావడంతో ఎవరూ రెస్పాన్స్‌ కావడం లేదు. అప్పుడు ఇద్దరం ఒకరినొకరం చూసుకున్నాం. వెంటనే ఆసుపత్రికి బయలుదేరాలని ఆమె పిచ్చిగా కాల్స్‌ చేస్తూ ఉంది. కరీనా పరిస్థితి గమనించే నేనే తనకు ధైర్యం చెప్పాను. నాకు ఏం కాదని తెలిపాను. 

ఆ సమయంలో తైమూర్‌ నా దగ్గరకు వచ్చి.. నాన్నా.. నువ్వు చనిపోతావా..? అని అడిగాడు. అప్పుడు నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. అలాంటిది ఏమీ జరగదు అమ్మ ఉంది కదా అని చెప్పాను. చికిత్స కోసం వెళ్తుండగా నేనూ వస్తానంటూ తైమూర్‌ కూడా ఆసుపత్రికి వచ్చాడు. ఆ సమయంలో నేను కూడా వాడిని తీసుకొని వెళ్లాలని అనుకున్నాను. నాకు ఏమైనా జరిగితే నా కుమారుడు నా పక్కనే ఉండాలని ఆ సమయంలో అనిపించింది.' అని ఆయన అన్నారు.

ముంబై బాంద్రాలోని సైఫ్‌ అలీఖాన్‌ నివాసంలో జనవరి 16న తెల్లవారుజామున 2.30 గంటలకు ఆయనపై దాడి జరిగింది. దుండగుడు సైఫ్‌ చిన్న కుమారుడు జేహ్‌ గదిలోకి వెళ్లడం గమనించిన కేర్‌టేకర్‌ కేకలు వేయగా సైఫ్‌ అక్కడికి చేరుకున్నాడు. ఆ సమయంలో పెనుగులాట జరిగింది. ఈక్రమంలోనే సైఫ్‌ గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి