Breaking News

దేవర యాక్షన్‌ సీక్వెన్స్‌.. ఆ సీన్‌కు ఏకంగా పది రోజులు: సైఫ్ అలీ ఖాన్

Published on Sun, 09/15/2024 - 13:29

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం దేవర పార్ట్-1. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్- శివ కొరటాల కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. సముద్ర బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో దేవర టీమ్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ నిర్విహంచారు.

ఈ సందర్భంగా దేవర నటుడు సైఫ్ అలీ ఖాన్‌ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దేవరలో ఫైట్‌ సీక్వెన్స్‌ అద్భుతంగా ఉన్నాయని అన్నారు. మైథలాజికల్ సెంటిమెంట్‌, దేవతలకు రక్త అర్పించడం లాంటి వయొలెన్స్‌ సీక్వెన్సెస్ ఉన్నాయని సైఫ్ అన్నారు. క్లైమాక్స్‌ ఫైట్ సీక్వెన్స్‌ నాలుగు గ్రామాల మధ్య జరిగే యుద్ధమని తెలిపారు. దేవరలో ఒక ఫైట్‌ సీక్వెన్స్‌ కోసం ఏకంగా పది రోజులు షూటింగ్ చేశామని సైఫ్ అలీ ఖాన్‌ వెల్లడించారు.

(ఇది చదవండి: దేవర మూవీ క్రేజ్‌.. రిలీజ్‌కు ముందే రికార్డులు!)

కాగా.. ఇప్పటికే దేవర ట్రైలర్ రిలీజ్‌ కాగా.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఓవర్‌సీస్‌లోనూ టికెట్ ప్రీ బుకింగ్స్‌లో దేవర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)