Breaking News

ఆ స్టార్‌ హీరో ఇంట్లో చోరీకి ప్లాన్‌.. వర్కవుట్‌ కాకపోవడంతో సైఫ్‌ ఫ్లాట్‌లో!

Published on Fri, 01/17/2025 - 13:52

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ (Saif Ali Khan) దాడి ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు తొలుత.. స్టార్‌ హీరో షారూఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) ఇంట్లో దొంగతనం చేసేందుకు ప్లాన్‌ వేసుకున్నాడట! షారూఖ్‌ నివాసమైన మన్నత్‌లో  జనవరి 14న చోరీకి పథకం రచించాడట! కానీ అక్కడ భద్రత ఎక్కువగా ఉండటంతో ఇంట్లోకి ప్రవేశించలేకపోయాడని తెలుస్తోంది. దీంతో అతడు పటిష్ట భద్రత లేని సైఫ్‌ అలీఖాన్‌ ఇంటిని ఎంచుకున్నాడు.

ఏం జరిగిందంటే?
బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై దాడి ఘటనతో చిత్రపరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎక్కువగా సంపన్నులు నివాసముండే బాంద్రాలోని సైఫ్‌ ఇంట్లోకి జనవరి 16న గుర్తు తెలియని దుండగుడు దూరాడు. సైఫ్‌ చిన్న కుమారుడు జెహ్‌ (Jehangir Ali Khan) గదిలో మాటువేసిన దుండగుడి కదలికలను గమనించిన పనిమనిషి బిగ్గరగా కేకలు వేసింది. 

ఆ శబ్దాలు వినిపించి నిద్ర నుంచి మేల్కొన్న సైఫ్‌ పరుగెత్తుకుంటూ ఆ గదిలోకి వచ్చాడు. దుండగుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఈ పెనుగులాటలో దుండగుడు సైఫ్‌ను విచక్షణారహితంగా కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. ఆరు కత్తిపోట్లతో రక్తమోడుతున్న సైఫ్‌ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కారు కూడా సిద్ధంగా లేకపోవడం శోచనీయం. దీంతో నటుడి పెద్ద కుమారుడు ఇబ్రహీం ఆటోలో తండ్రిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. 

ఫైర్ ఎగ్జిట్ మెట్ల ద్వారా ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు

వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించడంతో ప్రాణాపాయం తప్పింది. వెన్నెముకలో 2.5 అంగుళాల కత్తి మొన విరగ్గా ఆపరేషన్‌ చేసి దాన్ని తొలగించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పది బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. 36 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. దొంగతనం కోసమే దుండగుడు సైఫ్‌ ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

చదవండి: సైఫ్‌ అలీ ఖాన్‌పై దాడి.. దుండగుడి డిమాండ్‌ ఏంటంటే.?

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)