Breaking News

Saif Ali Khan: వెన్నెముకలో విరిగిన కత్తి.. నటుడికి ప్లాస్టిక్‌ సర్జరీ

Published on Thu, 01/16/2025 - 13:48

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ (Saif Ali Khan)పై దాడి ఘటనలో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేసేందుకు వచ్చిన వ్యక్తి నిన్న రాత్రే ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రంతా ఇంట్లోనే దాక్కున్న దొంగ తెల్లవారుజామున దొంగతనానికి ప్రయత్నించాడు. సైఫ్‌ అలీ ఖాన్‌ పిల్లల బెడ్‌రూమ్‌ దగ్గరే దుండగుడు పనిమనిషితో ఘర్షణ పడినట్లు తెలుస్తోంది.

ఆరుసార్లు పొడిచి..
ఆ అలికిడి గమనించిన నటుడు దుండగుడిని అడ్డుకునే క్రమంలో తోపులాట జరిగింది. ఈ సమయంలో దొంగ సైఫ్‌ అలీఖాన్‌ను ఆరుసార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సమయానికి కారు రెడీగా లేకపోవడంతో రక్తమోడుతున్న తండ్రిని ఇబ్రహీం అలీ ఖాన్‌ (Ibrahim Ali Khan) ఆటోలో తీసుకెళ్లాడు. ఉదయం మూడున్నర గంటల ప్రాంతంలో లీలావతి ఆస్పత్రిలో చేర్పించారు.

చదవండి: ఇంట్లో దోపిడీయత్నం.. హీరో సైఫ్‌ అలీఖాన్‌పై కత్తితో దాడి!

వెన్నెముకకు సర్జరీ
అతడిని పరీక్షించిన వైద్యులు సైఫ్‌ వెన్నెముకలో కత్తి మొన విరిగినట్లు గుర్తించారు. వెన్నెముక నుంచి 2.5 అంగుళాల పొడవైన కత్తి మొనను సర్జరీ ద్వారా తొలగించారు. మెడపై అయిన లోతైన గాయానికి ప్లాస్టిక్‌ సర్జరీ చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సైఫ్‌ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.

సీసీటీవీ ప్రకారం..
సీసీటీవీ ఫుటేజ్‌ ప్రకారం.. ఘటన జరగడానికి రెండు గంటల ముందు వరకు ఎవరూ ఇంట్లోకి ప్రవేశించలేదని పోలీసులు వెల్లడిస్తున్నారు. దీన్ని బట్టి దొంగ నిన్న రాత్రే ఇంట్లోకి చొరబడ్డాడని చెప్తున్నారు. దీంతో సైఫ్‌ శత్రువులు ప్లాన్‌ ప్రకారం అతడిపై దాడి చేయించారా? లేదా తెలిసినవాళ్లే ఈ పని చేయించారా? అని పలువురూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హీరోగా ఎన్నో సినిమాలు చేసిన సైఫ్‌ అలీ ఖాన్‌ ఇటీవల నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రల్లో అలరిస్తున్నాడు. తెలుగులో దేవర సినిమాలో విలన్‌గా నటించాడు.

సైఫ్‌ వ్యక్తిగత విషయానికి వస్తే..
సైఫ్ అలీ ఖాన్ 1991లో అమృతా సింగ్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి సారా, ఇబ్రహీం అని ఇద్దరు సంతానం. సైఫ్‌- అమృత 2004లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సైఫ్.. కరీనాను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య 10 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. ఈ జంటకు తైమూర్, జెహ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

చదవండి: బ్లాక్‌బస్టర్‌ పొంగల్‌.. కలెక్షన్స్‌ ఎంత వచ్చాయంటే?

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)