Breaking News

ఈ సినిమా నాకు ఊపిరినిస్తుంది: సాయిరామ్‌ శంకర్‌

Published on Wed, 01/22/2025 - 00:10

సాయిరామ్‌ శంకర్‌ హీరోగా నటించిన చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. విహాన్‌ ఫిల్మ్స్‌ బ్యానర్, గార్లపాటి రమేశ్‌ విహారి సినిమా హౌస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌లతో కలిసి ఈ చిత్రదర్శకుడు వినోద్‌ కుమార్‌ విజయన్‌ నిర్మించారు. ఫిబ్రవరి 7న ఈ మూవీ రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా హీరో సాయిరామ్‌ శంకర్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో సిద్ధార్థ నీలకంఠ అనే లాయర్‌ పాత్ర చేశాను. పబ్లిక్‌ప్రాసిక్యూటర్‌ మరియు క్రిమినల్‌ లాయర్‌ని. క్రిమినల్‌ లాయరా? లేక క్రిమినలా? జరిగిన క్రైమ్‌తో ఈ లాయర్‌కు సంబంధం ఉందా? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇలాంటి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీని ఆడియన్స్‌ ఇప్పటివరకూ చూసి ఉండరని నా అభిప్రాయం. ఈ సినిమా కోసం నటనలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను.

నాకు వచ్చిన గ్యాప్‌ని ఈ సినిమా ఫిల్‌ చేస్తుంది. ఈ సినిమా నాకు ఊపిరినిస్తుంది. ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో ‘పట్టుకుంటే పదివేలు’ అనే కాంటెస్ట్‌ పెట్టబోతున్నాం. ఇంటర్వెల్‌ లోపు విలన్‌ ఎవరో కనిపెడితే మీకు (ఆడియన్స్‌) స్పాట్‌లో పది వేలు ఇస్తారు. ఒక కూపన్‌ ఇస్తారు. ఇంటర్వెల్‌ తర్వాత ఆ కూపన్‌లో విలన్‌ ఎవరో చెప్పి... సెకండాఫ్‌ చూసిన తర్వాత మీరు రాసింది కరెక్ట్‌ అయితే.. స్పాట్‌లో పది వేలు ఇస్తారు. ఇలా 50 సెంటర్స్‌లో ఇవ్వబోతున్నాం’’ అని అన్నారు.

‘‘ఈ సినిమాలో సాయిరామ్‌ శంకర్‌ను కొత్తగా చూస్తారు’’ అన్నారు వినోద్‌. ‘‘ప్రేక్షకులు మా సినిమాను ఆదరించాలి’’ అని కోరారు గార్లపాటి రమేశ్‌. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోనే 300 థియేటర్స్‌కు తగ్గకుండా ఈ చిత్రం ప్రదర్శితమయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేశాం’’ అని తెలిపారు శ్రీ లక్ష్మీ పిక్చర్స్‌ బాపిరాజు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)