Breaking News

రజినీకాంత్‌ క్రేజీ సినిమాలో సాయిపల్లవి

Published on Tue, 01/27/2026 - 06:37

నటుడు రజనీకాంత్‌ హీరోగా నటించనున్న నూతన చిత్రంలో నటి సాయిపల్లవి నటించనున్నారా..? ఈ ప్రశ్నకు అలాంటి అవకాశం ఉంది అంటూ  కోలీవుడ్‌ వర్గాల నుంచి సమాధానం వస్తుంది. రజినీకాంత్‌ ప్రస్తుతం జైలర్‌ –2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తదుపరి కమలహాసన్‌ తన రాజ్‌ కమల్‌ ఇంటర్నేషనల్‌ ఫిలింస్‌ పతాకంపై నిర్మించనున్న చిత్రంలో నటుడు రజనీకాంత్‌ నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శిబి చక్రవర్తి తెరకెక్కించనున్నారు. అనిరుధ్‌ సంగీతాన్ని అందించే ఈ చిత్రం త్వరలో సెట్‌ పైకి వెళ్లనుందని సమాచారం. 

కాగా ఇందులో నటించే ఇతర తారాగణం గురించిన వివరాలు ఇంకా వెలువడకున్నా, ముఖ్య పాత్రలో నటి సాయిపల్లవిని నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య నటుడు కమలహాసన్‌ నిర్మించిన అమరన్‌ చిత్రంలో సాయిపల్లవి కథానాయకిగా నటించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈమె హిందీలో ఏక్‌ ధిన్, రామాయణ 1,2 చిత్రాల్లో నటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమిళంలో రజనీకాంత్‌ హీరోగా నటించనున్న  173వ చిత్రంలో సాయిపల్లవి నటించనున్నారనే ప్రచారం హోరెత్తుతోంది. 

అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదన్నది గమనార్హం. కాగా నటుడెవరైనా, దర్శకుడెవరైనా తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే నటి సాయిపల్లవి నటించడానికి అంగీకరిస్తారన్నది తెలిసిందే. దీంతో ఈమె రజనీకాంత్‌ చిత్రంలో నటించడానికి సై అంటారా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కాగా ఇటీవల రజనీకాంత్‌ హీరోగా నటించిన కూలీ చిత్రంలో నటి శృతీహాసన్‌ ముఖ్య పాత్రలో నటించడం గమనార్హం.  రజనీ సినిమాలో సాయిపల్లవి పాత్ర బలంగా ఉంటే తప్పకుండా చేస్తుందని ఆమె అభిమానులు చెబుతున్నారు. గతంలో తనకు చిరంజీవి సినిమా ఛాన్స్‌ వచ్చినా సరే రిజెక్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)