Breaking News

తొలిసారి రొమాంటిక్‌ సాంగ్‌లో సాయిపల్లవి

Published on Wed, 03/20/2024 - 13:20

మావీరన్‌, అయలాన్‌ చిత్రాల విజయాలతో మంచి ఖుషీగా ఉన్న నటుడు శివకార్తికేయన్‌. నటనకు అవకాశం ఉన్న పాత్రలనే అంగీకరించే నటి సాయిపల్లవి. ఈ రేర్‌ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం అమరన్‌. నటుడు కమలహాసన్‌ తన రాజకమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌ కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్న అమరన్‌ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఇందులో నటుడు శివకార్తికేయన్‌ సైనికుడిగా నటిస్తున్నారు. ఆయనకు సతీమణిగా సాయి పల్లవి నటిస్తున్నారు.

  • ఈ చిత్ర షూటింగ్‌ కాశ్మీర్‌లో 3 నెలల పాటు చిత్రీకరణను జరుపుకుంది. మరో పది రోజుల చిత్రీకరణతో షూటింగ్‌ పూర్తి అవుతుందని యూనిట్‌ సభ్యుల సమాచారం. కాగా మిగిలిన షూటింగ్‌ చైన్నె పరిసర ప్రాంతాలలో నిర్వహించి పూర్తి చేయనున్నట్లు తెలిసింది. ఇందులోని ఒక రొమాంటిక్‌ గీతాన్ని శివకార్తికేయన్‌, సాయి పల్లవిపై చిత్రీకరించనున్నట్లు తెలిసింది. రొమాంటిక్‌ సాంగ్స్‌లలో సాయిపల్లవి ఇప్పటి వరకు కనిపించింది లేదు. కానీ ఇందులో కథ అవసరం మేరకు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఏదేమైన సాయిపల్లవి కొన్ని బార్డర్స్‌ ఎప్పటికీ దాటదని తెలిసిందే.

  • తదుపరి నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్ట్‌లో అమరన్‌ చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో శివకార్తికేయన్‌ తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు. ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రారంభమై చిత్రీకరణను జరుపుకుంటోంది. కాగా దీంతో పాటు శివకార్తికేయన్‌ మరో రెండు చిత్రాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తాజా సమాచారం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)