స్టార్‌ హీరో కుమారుడితో సాయి పల్లవి.. లైన్‌ క్లియర్‌

Published on Thu, 09/14/2023 - 08:08

సౌత్‌ ఇండియాలో  మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడీ పవర్‌స్టార్‌ సాయిపల్లవికి విపరీతమైన అభిమానులు ఉన్నారు.  సంపాదించిన సాయి పల్లవి ఇప్పుడు హిందీలో ఆరంగేట్రం చేయనున్నారు. తన నటనతో పాటు అద్భుతమైన డ్యాన్స్‌తో విశేష క్రేజ్‌ సొంతం చేసుకున్న సాయి పల్లవి బాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా బాలీవుడ్‌ మీడియాలో ప్రస్తుతం ఆమె పేరు  మార్మోగుతోంది.

(ఇదీ చదవండి: Harsha Sai: సినిమా ప్రకటించిన హర్షసాయి.. నిర్మతలుగా సీఎం బంధువుతో పాటు బిగ్‌బాస్‌ బ్యూటీ)

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌  తనయుడు జునైద్‌ ఖాన్‌ త్వరలోనే తెరంగేట్రం చేయబోతున్నాడు. ఆయన నటిస్తున్న తొలి చిత్రాన్ని యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇది పూర్తికాకముందే జునైద్‌ హీరోగా మరో చిత్రం ఖరారైందని, అందులో హీరోయిన్‌గా సాయి పల్లవిని ఎంపిక చేశారంటూ వార్తలొస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయింది అని కూడా వార్తలు రాస్తున్నారు. దీనికి సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నాడు అని, ఇది ఒక ప్రేమ కథా చిత్రం అని కూడా అంటున్నారు. బాలీవుడ్‌లో పలు సినిమాలకు అసిస్టెంట్ దర్శకుడిగా అమిర్‌ ఖాన్‌ కుమారుడు జునైద్ పనిచేశాడు.  

ఈ మేరకు లాస్‌ ఏంజిల్స్‌లోని ఓ డ్రామా స్కూల్‌లో కొన్నాళ్లు శిక్షణ తీసుకున్నాడు. తన తండ్రి నటించిన ‘పీకే’ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. సాధారణంగా మీడియాకు దూరంగా ఉండే అతను ఇప్పుడు హీరోగా తెరపై కనిపించనున్నాడు. తన తండ్రి పేరు చెప్పకుండా మొదటి సినిమా అవకాశాన్ని దక్కించుకున్నాడు. అలా సుమారు 20 సార్లు తిరస్కరణకు గురి అయిన తర్వాత సినిమా అవకాశం దక్కించుకున్నాడు.

నేచురల్ హీరోయిన్​ సాయి పల్లవి గురించి తెలిసిందే. అందం కాదు అభినయమే ఆమెకు ముఖ్యం. ఎప్పుడూ పాజిటివ్​గా స్మైల్​తో ఆకట్టుకునే ఈ బ్యూటీ. వెండితెరపై తన పాత్రలకు ప్రాణం పోస్తుంది. అయితే గత కొద్దిరోజులుగా స్క్రీన్​పై తక్కువుగా కనిపిస్తున్న ఆమె. చివరగా 2022లో విరాట్ పర్వం, గార్గి చిత్రాలతో మెరిసింది. ప్రస్తుతం శివకార్తికేయన్​తో ఓ సినిమా చేస్తోంది.  తాజాగా ఆమె ఈ బాలీవుడ్‌ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)