Breaking News

భారీగా డిమాండ్‌ చేస్తున్న సాయిపల్లవి!

Published on Thu, 12/04/2025 - 07:00

డాక్టర్‌ కావాలనుకుని యాక్టర్‌ అయినవారిలో హీరోయిన్‌ సాయిపల్లవి ఒకరు. చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగింది. ఈమె మలయాళంలో నటించిన ప్రేమమ్‌ అనూహ్య విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఈ నేచురల్‌ బ్యూటీకి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు ఎర్ర తివాచీ పరిచాయి. మంచి క్లాసికల్‌ డ్యాన్సర్‌ అయిన సాయిపల్లవి మొదటినుంచి గ్లామర్‌ను దరి చేరనీయకుండా జాగ్రత్త పడుతూ పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.

అంతేకాకుండా ఈమె నటించిన చిత్రాలు మంచి విజయాన్ని సాధిస్తుండటంతో బోలెడంత క్రేజ్‌ వచ్చింది. తెలుగులో నాగచైతన్యకు జంటగా నటించిన తండేల్‌, తమిళంలో శివకార్తికేయన సరసన నటించిన అమరన్‌ ఘన విజయాలు సాధించడంతో ఆమె రేంజ్‌ మరింత పెరిగింది. దీంతో ఈమె బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. అక్కడ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో సీతగా నటిస్తోంది. 

దాంతో పాటు మరో హిందీ చిత్రంలోనూ నటించే అవకాశం వరించిందని సమాచారం. కొంత గ్యాప్‌ తర్వాత దక్షిణాది చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతోంది సాయిపల్లవి (Sai Pallavi). రజనీకాంత్‌ హీరోగా కమల్‌ హాసన్‌ తన రాజ్‌ కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మించనున్న చిత్రంలో సాయిపల్లవి నటించనున్నారని లేటెస్ట్‌ టాక్‌. ఈ మూవీలో నటించేందుకు ఆమె అత్యధికంగా రూ.15 కోట్ల పారితోషికం డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)