Breaking News

వాటి కంటే అభిమానులే నాకు ముఖ్యం: సాయిపల్లవి

Published on Thu, 04/24/2025 - 06:30

మాలీవుడ్‌లో కథానాయకిగా కెరీర్‌ను ప్రారంభించిన  నటి సాయిపల్లవి(Sai Pallavi ). తొలి చిత్రం ప్రేమమ్‌తోనే నటిగా తానేమిటో నిరూపించుకున్న ఈమె ఆ తరువాత తెలుగు, తమిళం, తాజాగా హిందీ అంటూ ఇండియన్‌ సినిమాను చుట్టేస్తున్నారు. సాధారణంగా ఒక్క అవకాశం అంటూ నటీమణులు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే అవకాశాలే సాయిపల్లవి కోసం ఎదురు చూస్తుంటాయి. అలాగని అల్లాటప్పా పాత్రల్లో నటించడానికి ఈమె ససేమిరా అంటారు. అది ఎంత భారీ చిత్రం అయినా, ఎంత స్టార్‌ హీరో చిత్రం అయినా సరే. తన పాత్రకు కథలో ప్రాధాన్యత ఉందా, అందులో నటనకు అవకాశం ఉందా అన్నది ఆలోచించి మరీ చిత్రాలు చేసే నటి సాయిపల్లవి. 

మణిరత్నం లాంటి దర్శకుడే ఈమెతో చిత్రం చేయాలన్న ఆసక్తిని వ్యక్తం చేశారంటే మామూలు విషయం కాదుగా. ఇటీవల సాయిపల్లవి కథానాయకిగా శివకార్తికేయన్‌ సరసన  నటించిన అమరన్‌ చిత్రం సంచలన విజయాన్ని సాధించడంతో పాటూ ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. అదేవిధంగా నాగచైతన్యకు జంటగా నటించిన తండేల్‌ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా హిందీలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం రామాయణంలో సీతగా నటిస్తున్నారు. కాగా ఇటీవల ఈమె ఓ భేటీలో అవార్డుల గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ  తనకు అవార్డుల కంటే అభిమానుల అభిమానమే ముఖ్యం అన్నారు. 

థియేటర్లలో ప్రేక్షకులు తన కథా పాత్రలను చూసి అందులోని ఎమోషన్స్‌తో లీనమైతేనే చాలని అదే పెద్ద విజయంగా భావిస్తానని పేర్కొన్నారు. పాత్రల ద్వారా యదార్ధతను చెప్పే లాంటి పాత్రలను తాను ఎప్పుడూ కోరుకుంటానన్నారు. తాను భావించినట్లు ఆ కథాపాత్రల్లోని ఎమోషన్స్‌కు ప్రేక్షకులు కనెక్ట్‌ అయితే అదే పెద్ద విజయంగా భావిస్తానని నటి సాయిపల్లవి పేర్కొన్నారు. అందుకే అవార్డుల కంటే అభిమానుల ప్రేమాభిమానాలే ముఖ్యం అన్నారు. అభిమానుల ఆదరాభిమానాలను పొందడానికే తాను ప్రాధాన్యతనిస్తానని స్పష్టం చేశారు.   

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)