Breaking News

పేరు మార్చుకున్న మెగా హీరో.. కొత్తగా..

Published on Sat, 03/09/2024 - 08:44

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ పేరు మార్చుకున్నాడు. తన తల్లి దుర్గ పేరును తీసుకుని సాయిదుర్గ తేజ్‌గా సరికొత్తగా నామకరణం చేసుకున్నాడు. అమ్మ ఎప్పటికీ తనతో ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అలాగే తల్లి పేరు మీదట ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభించాలన్న కలను సైతం నెరవేర్చుకున్నాడు. దుర్గ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ ప్రారంభించినట్లు తెలిపాడు. ఈ బ్యానర్‌ ద్వారానే సోల్‌ ఆఫ్‌ సత్య షార్ట్‌ ఫిలిం తెరకెక్కిందని పేర్కొన్నాడు.

నెక్స్ట్‌ టార్గెట్‌ చిరంజీవే
మార్చి 8న ఉమెన్స్‌ డే (మహిళా దినోత్సవం) సందర్భంగా సోల్‌ ఆఫ్‌ సత్య ప్రత్యేక ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ వేదికపైనే తన పేరు మార్పును వెల్లడించాడు. రామ్‌చరణ్‌తో మల్టీస్టారర్‌ సినిమా ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చా? అన్న ప్రశ్నకు.. మొన్నే పవన్‌ కల్యాణ్‌తో సినిమా చేశాను. అంతకుముందు నాగబాబుగారితో చేశాను. నా నెక్స్ట్‌ టార్గెట్‌ చిరంజీవిగారే! మా చిరుమామతో సినిమా చేశాకే మిగతావాళ్లతో మల్టీస్టారర్‌ చేస్తాను అని తేజ్‌ చెప్పుకొచ్చాడు.

వెబ్‌సైట్‌లో రాస్తేనే తెలిసింది
గాంజా శంకర్‌ సినిమా ఉందా? ఆగిపోయిందా? అన్న ప్రశ్నకు.. 'సినిమా ఆగిపోయిందని ఓ వెబ్‌సైట్‌లో వార్త చూశాకే నాకూ తెలిసింది. మూవీ ఉందా? లేదా? అన్న విషయం ఆ వెబ్‌సైట్స్‌ చెప్తే కానీ తెలియదు' అని వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. సాయిధరమ్‌ తేజ్‌, కలర్స్‌ స్వాతి ప్రధాన పాత్రల్లో నటించిన షార్ట్‌ ఫిలిం సత్య. సీనియర్‌ నటుడు నరేశ్‌ తనయుడు నవీన్‌ విజయ్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ షార్ట్‌ ఫిలిం ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుంది.

చదవండి: ఓటీటీకి హనుమాన్.. తొలిసారి అలాంటి షాకింగ్‌ నిర్ణయం!

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)