Breaking News

ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా

Published on Fri, 04/10/2026 - 22:59

ప్రస్తుతం అంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్లలో రిలీజ్ కావడం ఆలస్యం.. నెల, నెలన్నరలో స్ట్రీమింగ్‌లోకి వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలు మాత్రం చాన్నాళ్ల తర్వాత అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు అలానే ఓ హారర్ థ్రిల్లర్ మూవీ తెలుగు వెర్షన్ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటి దీని సంగతి? ఎందులో ఉంది?

స్వతహాగా తమిళ హీరో అయినప్పటికీ తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి.. 'శబ్దం' అనే హారర్ థ్రిల్లర్ చేశాడు. గతేడాది ఫిబ్రవరి 28న తెలుగు, తమిళంలో ఇది థియేటర్లలో రిలీజైంది. కానీ పెద్దగా మెప్పించలేకపోయింది. గతంలో ఆదితోనే 'వైశాలి' తీసిన అరివళగన్.. ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ సక్సెస్‌ని రిపీట్ చేయలేకపోయారు. ఇకపోతే ఈ మూవీ తమిళ వెర్షన్.. గత నెల 24న జీ5 ఓటీటీలోకి వచ్చింది. తర్వాత కొన్నిరోజులకు హిందీ వెర్షన్ తీసుకొచ్చారు. ఇప్పుడు తెలుగు డబ్బింగ్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

'శబ్దం' విషయానికొస్తే.. మున్నార్‌లోని ఓ మెడికల్ కాలేజీ. అందులోని విద్యార్థులు ఒకరు తర్వాత ఒకరు అనుమానస్పద రీతిలో చనిపోతుంటారు. పోలీసులు, మీడియాకు తెలిస్తే కాలేజీ పరువు పోతుందని యాజమాన్యం.. ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్‌తో కాలేజీ మొత్తం పరిశోధిన జరిపించి దెయ్యాలు, ఆత్మలు లేవని నిరూపించాలనుకుంటుంది. ఇందుకోసం పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ వ్యూమా వైద్యలింగం(ఆది పినిశెట్టి)ని తీసుకొస్తుంది. మనుషులకు కూడా వినిపించని శబ్దాలని తన దగ్గరున్న సాంకేతిక పరికరాలతో వింటూ, ఆత్మలతో మాట్లాడి ఆ కేసుల్ని పరిష్కరిస్తుంటాడు.

అయితే ఈ కాలేజీలో పనిచేసే లెక్చరర్ అవంతిక(లక్ష‍్మి మేనన్)పై వ్యూమాకి అనుమానం మొదలవుతుంది.ఆ కాలేజీలోని సెంట్రల్ లైబ్రరీలోనే అవంతిక‌పై ఓ ప్రయోగానికి సిద్ధప‌డ‌గా, అక్కడే 42 ఆత్మలు ఉన్నట్లు క‌నిపెడ‌తాడు. ఆత్మలుగా మారిన ఆ 42 మంది ఎవ‌రు? వాళ్లకు కాలేజీలో జ‌రుగుతున్న చావుల‌కు సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

Videos

చంద్రబాబు గూటిలో చిలక షర్మిల.. గుడివాడ అమర్నాథ్ స్ట్రాంగ్ కామెంట్స్

సోలార్, ఎలక్ట్రానిక్స్ డిమాండ్ వెండి ధరలకు రెక్కలు..!

జగన్ ను ప్రశ్నించే హక్కు దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేదు..

10 కోట్లు స్కామ్.. పంజాగుట్టలో సింగర్ మంగ్లీపై కేసు

పెద్దిలో స్పెషల్ సాంగ్..?

Allu Arjun : 175 కోట్లు రెమ్యూనరేషన్..?

కాంగ్రెస్ లో TDP నేతలు.. జీవన్ రెడ్డికి పొగ బెట్టారా?

ఈ పనికిమాలినోడు అలా చేశాడని, మనం టెంపుల్స్ జోలికి పోతామ?

రాజధాని హైదరాబాద్ లో కట్టుకుందాం మీకు సౌకర్యంగా ఉంటది రాచమల్లు సెటైర్లు

భారీగా పడిపోతున్న బంగారం ధరలు

Photos

+5

శర్వానంద్‌ 'బైకర్‌' థాంక్యూ మీట్‌ (ఫోటోలు)

+5

ట్రెండింగ్‌లో తెలుగు హీరోయిన్‌ మానస వారణాసి (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : గచ్చిబౌలి స్టేడియంలో యోగ భాగ్యం (ఫొటోలు)

+5

గ్రాండ్ గా అనంత్ అంబానీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతామహాలక్ష్మిలా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

తిమ్మరాజుపల్లి టీవీ.. వెరైటీగా ట్రైలర్‌ లాంచ్‌ (ఫోటోలు)

+5

మిస్‌ తెలుగు యూఎస్‌ఏ విజేతగా భాగ్యనగరం బ్యూటీ..! (ఫొటోలు)

+5

తిరుపతిలో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లగ్న పత్రిక వేడుక (ఫొటోలు)