Breaking News

తారక్‌ పూనకం వచ్చినట్లే చేశాడు.. నాదేం లేదు: రాజమౌళి

Published on Thu, 04/17/2025 - 11:36

ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR Movie)లో రోమాలు నిక్కబొడుచుకునే పాట+ సన్నివేశం అనగానే చాలామందికి మొదట గుర్తొచ్చేది కొమురం భీముడో సాంగ్‌.. ఈ పాటలో జూనియర్‌ ఎన్టీఆర్‌ను చిత్రహింసలు పెడుతున్నా.. అతడు ప్రజలను ఒక్కటి చేసేందుకు ప్రయత్నించడం.. ఈ క్రమంలో ఆయన పలికించే భావోద్వేగాలు.. నెక్స్ట్‌ లెవల్‌లో ఉంటాయి. ఆ సమయంలో తారక్‌ను చూస్తే ఏదో పూనకం వచ్చినట్లే కనిపించాడంటున్నాడు దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (S. S. Rajamouli).

తారక్‌ వల్లే ఈజీ..
జపాన్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌ డాక్యుమెంటరీ ప్రమోషన్లలో రాజమౌళి మాట్లాడుతూ.. కొమురం భీముడో పాట (Komuram Bheemudo Song) షూటింగ్‌ చాలా ఈజీగా అయిపోయింది. ఎందుకంటే తారక్‌ (Jr NTR) పోషించిన పాత్ర తాలూకు ఆత్మ అతడిలో ప్రవేశించినట్లుగానే యాక్ట్‌ చేశాడు. అతడు అద్భుతమైన నటుడని మనందరికీ తెలుసు. ఈ పాటలో మాత్రం మరో స్థాయిలో నటించాడు. తనిచ్చే ఒక్కో ఎక్స్‌ప్రెషన్‌.. నుదుటిపై కండరాల కదలిక.. అన్నీ పర్ఫెక్ట్‌గా కుదిరాయి.

కొరియోగ్రాఫర్‌ నైపుణ్యం కూడా..
నేను కేవలం కెమెరాను అతడి ముఖం ముందు పెట్టి పాట ప్లే చేశానంతే.. చివరకు ఆ పర్ఫామెన్స్‌ అద్భుతంగా వచ్చింది. ఈ విషయంలో కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌ (Prem Rakshit)కు కూడా క్రెడిట్‌ ఇవ్వాల్సిందే! అతడిని ఎలా కట్టేయాలి, గాల్లో ఎలా వేలాడదీయాలి.. ఇలా అన్నింటినీ తను చాలా బాగా కొరియోగ్రఫీ చేశాడు అని మెచ్చుకున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ విషయానికి వస్తే.. విజయేంద్రప్రసాద్‌ కథ అందించిన ఈ చిత్రాన్ని ఆయన తనయుడు రాజమౌళి తెరకెక్కించాడు. 

వెయ్యికోట్లకు పైనే..
సాయిమాధవ్‌ బుర్రా డైలాగ్స్‌ అందించగా డీవీవీ దానయ్య నిర్మించాడు. రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా నటించారు. అజయ్‌ దేవ్‌గణ్‌, ఆలియా భట్‌, శ్రియా, సముద్రఖని, ఒలీవియా మోరిస్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందించాడు. 2022 మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దాదాపు రూ.1300 కోట్లకు పైగా రాబట్టింది. ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌ (RRR: Behind and Beyond) డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

రాజమౌళి నెక్స్ట్‌ మూవీ..
ప్రస్తుతం రాజమౌళి.. సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబుతో కలిసి సినిమా చేస్తున్నాడు. ఇందులో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా 2027లో విడుదల కానుంది. జూనియర్‌ ఎన్టీఆర్‌ విషయానికి వస్తే.. అతడు వార్‌ 2 చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో హృతిక్‌ రోషన్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నాడు. ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది.

 

 

చదవండి: సమంత 'సిటాడెల్‌ 2' లేనట్లే.. ప్రకటించిన అమెజాన్‌

 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)