Breaking News

కథ నచ్చడంతో నేనే నిర్మించా: రూపేష్

Published on Wed, 05/28/2025 - 11:36

‘‘ప్రస్తుతం మన సినిమాల్లో స్వచ్ఛమైన ప్రేమను చూపించడం లేదు. మా ‘షష్టిపూర్తి’ చిత్రంలో కుటుంబ అంశాలతో పాటు అన్ని రకాల భావోద్వేగాలను చూపించాం. అలాగే అందమైన ప్రేమకథ కూడా ఉంది. ఇందులోని పాత్రల్ని చూస్తే తమని తాము చూసుకున్నట్టుగా ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు’’ అని హీరో–నిర్మాత రూపేష్‌ తెలిపారు.

 రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో, రూపేష్, ఆకాంక్షా సింగ్‌ జంటగా నటించిన చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్‌ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌పై రూపేష్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో రూపేష్‌ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘షష్టిపూర్తి’ కథను రాజేంద్ర ప్రసాద్‌గారి కోసమే పవన్‌ ప్రభ రాసుకున్నారు. ఆయన కొడుకు పాత్ర కోసం నన్ను సంప్రదించారు. పవన్‌గారు చెప్పిన ఈ కథ బాగా నచ్చడంతో ఈ కథని రాజీ పడకుండా తీయాలనే ఆలోచనతో నేనే నిర్మించాను.

 ఔట్‌పుట్‌ చూసుకున్నాక... కథ విన్నప్పుడు కంటే రెండింతల సంతృప్తి కలిగింది. పవన్‌గారు అంత బాగా తెరకెక్కించారు. మా చిత్రానికి ఇళయరాజా, తోట తరణివంటి పెద్ద సాంకేతిక నిపుణులు పని చేయడంతో బడ్జెట్‌ అనుకున్న దాని కంటే ఎక్కువైంది. అయితే ఆ ఖర్చు అంతా తెరపై కనిపిస్తుంది. మా ఆయి ప్రొడక్షన్స్‌ అంటే మా అమ్మ ప్రొడక్షన్‌ అని అర్థం. నేను నటించిన తొలి చిత్రం ‘22’. అయితే ముందుగా ‘షష్టిపూర్తి’ విడుదలవుతోంది. ‘22’ని కూడా విడుదలకు సిద్ధం చేస్తున్నాం. నా తర్వాతి సినిమాలకు రెండు మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి’’ అని చెప్పారు. 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)