Breaking News

'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. ఫ్యాన్స్‌లో నిరాశ

Published on Sat, 01/11/2025 - 08:57

రామ్‌ చరణ్‌ (Ram Charan), శంకర్‌ (Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కిన పొలిటికల్‌ డ్రామా చిత్రం 'గేమ్‌ ఛేంజర్'. జనవరి 10న సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో విడుదలైంది.  ఈ చిత్రం తొలిరోజే కాస్త నెగటివ్‌ టాక్‌ రావడంతో అభిమానుల్లో నిరాశ ఎదురైంది. దీంతో కలెక్షన్స్‌ పరంగా కూడా ఈ చిత్రం అనుకున్నంతగా రాబట్టలేదని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ రివ్యూ)

'గేమ్‌ ఛేంజర్' (Game Changer)చిత్రం సుమారు రూ. 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. అయితే,  తొలిరోజు కేవలం రూ. 51 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. గ్రాస్‌ పరంగా అయితే సుమారు రూ. 80 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ.42 కోట్లు రాబట్టినట్లు సమాచారం. హిందీ వర్షన్‌లో అయితే రూ. 7 కోట్లతోనే ఈ చిత్రం సరిపెట్టుకుంది. తమిళ్‌ రూ.2.1 కోట్లు, కన్నడ రూ. 10 లక్షలు, మలయాళం రూ. 5 లక్షలు వరకు గేమ్‌ ఛేంజర్‌ రాబట్టింది. Sacnilk ప్రకారం గేమ్ ఛేంజర్ దేశవ్యాప్తంగా 17,161 షోలలో 9.39 లక్షల టిక్కెట్లను బుక్‌ మై షో విక్రయించింది. కేవలం ముందస్తు బుకింగ్‌లతో ప్రపంచవ్యాప్తంగా రూ. 26.8 కోట్లు ఈ చిత్రం ఆర్జించింది.

గేమ్ ఛేంజర్ చిత్రంలో అప్పన్న, రామ్‌ నందన్‌ పాత్రలతో రామ్‌ చరణ్‌ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో అప్పన్న పాత్రకు ఆయన 100 శాతం న్యాయం చేశారు. ఎవరైనా సరే చరణ్‌ నటనను మెచ్చుకుని తీరాల్సిందే అనేలా చక్కగా నటించారు. ఇప్పటికే అప్పన్న పాత్రకు సోషల్‌ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్ర యూనిట్‌ను మెగాస్టార్‌ చిరంజీవి అభినందించారు. నిర్మాత దిల్‌ రాజుతో పాటు దర్శకుడు శంకర్‌, ఎస్‌.జె. సూర్య, కియారా అద్వానీ, అంజలికి ఆయన   శుభాకాంక్షలు తెలిపారు. ఆపై సాయి దుర్గాతేజ్‌, ఉపాసన కూడా చరణ్‌ నటనకు ఫిదా అయ్యారు. ఆయన్ను ప్రశంసిస్తూ ట్వీట్స్‌ చేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలో మ‌ల‌యాళ థ్రిల్ల‌ర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్‌)

ఆరేళ్ల తర్వాత రామ్ చరణ్ సోలోగా వచ్చిన తొలి చిత్రం గేమ్ ఛేంజర్. 2019లో  బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన వినయ విధేయ రామ (VVR) చిత్రంతో సోలోగా బాక్సాఫీస్‌ వద్ద బరిలోకి దిగాడు. ఇందులో కూడా హీరోయిన్‌ కియారా అద్వానీ కావడం విశేషం. అయితే, అప్పట్లో మొదటిరోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 34 కోట్ల నెట​్‌ సాధించింది. గ్రాస్‌ పరంగా రూ. 68 కోట్ల వరకు ఓపెనింగ్‌ను క్రియేట్‌ చేసింది. అయితే, 2022లో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం మాత్రం రూ. 133 కోట్ల నెట్‌ రాబట్టింది. కానీ, గ్రాస్‌ పరంగా రూ. 232 కోట్లతో ఇండస్ట్రీ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు