Breaking News

ఎన్ని అవార్డులొచ్చినా ఆ ఫీలింగే వేరు: ఆర్ఆర్ఆర్ టీం

Published on Sat, 03/25/2023 - 16:54

దర్శకధీరుడు రాజమౌళి గ్లోబల్ బ్లాక్ బస్టర్ మూవీ 'ఆర్ఆర్ఆర్'. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది ఈ చిత్రం. బాక్సాఫీస్‌ను షేక్‌ చేసి పలు రికార్డులు కొల్లగొట్టింది. ఆర్ఆర్ఆర్ దెబ్బకు రికార్డులు క్యూ కట్టాయి. తాజాగా ఈ చిత్రం విడుదలై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రబృందం సోషల్ మీడియాలో సినీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపింది. ఇటివలే ఆస్కార్ అవార్డ్ కూడా దక్కించుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించింది. ట్విటర్‌లో ఎన్టీఆర్‌, రామ్‌ చరమ్ పోస్టర్‌ను షేర్ చేసింది. 

తన అధికారిక ట్విటర్‌లో రాస్తూ.. 'ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలై ఇప్పటికీ ఏడాది కావస్తోంది. ఇంకా ప్రపంచంలో ఎక్కడో థియేటర్లలో హౌస్‌ఫుల్‌గా సినిమా రన్ అవుతోంది. ఈ అనుభూతి అన్ని అవార్డుల కంటే పెద్దది. ఆర్ఆర్ఆర్ చిత్రంపై మీరు కురిపించిన ప్రేమకు  మీకు కృతజ్ఞతలు చెప్పిన సరిపోదు.' అంటూ పోస్ట్ చేసింది. పోస్టర్‌లో ఈ చిత్రానికి దక్కిన అవార్డులను ప్రదర్శించారు. కాగా.. ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. 

ఆర్ఆర్ఆర్ చిత్రం పొందిన అవార్డులివే

ఆస్కార్‌
బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ 

గోల్డెన్‌ గ్లోబ్‌
బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌  

న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌
బెస్ట్‌ డైరెక్టర్‌  

డొరియన్‌ అవార్డ్స్‌
నాన్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌  

క్రిటిక్స్‌ ఛాయిస్‌ మూవీ అవార్డ్స్‌
బెస్ట్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌ 
బెస్ట్‌ సాంగ్‌

సెలబ్రిటీ ఫిల్మ్‌ అవార్డ్స్‌
బెస్ట్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌

బోస్టన్‌ సొసైటీ ఆఫ్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌
బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌

పండోరా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అవార్డ్స్‌
సాంగ్‌ కంపోజింగ్‌

ఆస్టిన్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌
బెస్ట్‌ స్టంట్‌ కో-ఆర్డినేటర్‌

అట్లాంటా ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌
బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌

జార్జియా ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌
బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌

హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌
బెస్ట్ యాక్షన్‌ ఫిల్మ్‌
బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌
బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌
బెస్ట్‌ స్టంట్స్‌
స్పాట్‌ లైట్‌ అవార్డు

సియాటెల్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సొసైటీ
బెస్ట్‌ యాక్షన్‌ కొరియోగ్రఫీ

ఆన్‌లైన్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సొసైటి
బెస్ట్‌ స్టంట్‌ కో-ఆర్డినేషన్‌
బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌

హ్యుస్టన్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సొసైటీ
బెస్ట్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌ ఫీచర్‌
బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌
బెస్ట్‌ స్టంట్‌ కో-ఆర్డినేషన్‌ టీమ్‌

ఉటా ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌

బెస్ట్‌ నాన్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ ఫీచర్‌

సౌత్‌ ఈస్టర్న్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌

బెస్ట్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌
టాప్‌ టెన్‌ ఫిల్మ్స్‌

న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ ఆన్‌లైన్‌

టాప్‌ ఫిల్మ్స్‌ ఆఫ్‌ ది ఇయర్‌

నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్ రివ్యూ

టాప్‌ టెన్‌ ఫిల్మ్స్‌

లాస్‌ ఏంజిల్స్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌

బెస్ట్‌ మ్యూజిక్‌

శాటర్న్‌ అవార్డ్స్‌

బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌

Videos

మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)