ఆస్కార్‌ కోసం అమెరికా పయనమైన తారక్‌, వీడియో వైరల్‌

Published on Mon, 03/06/2023 - 10:24

పాన్‌ ఇండియా మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌' అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది. గోల్డెన్‌ గ్లోబ్‌, హెచ్‌సీఏ, లాస్‌ ఏంజిల్స్‌ ఫిలిం క్రిటిక్స్‌, క్రిటిక్స్‌ చాయిస్‌.. వంటి అవార్డులు ఎగరేసుకుపోయిన ఈ చిత్రం ప్రస్తుతం ఆస్కార్‌ రేసులో ఉంది. మార్చి 13న జరగనున్న 95వ అకాడమీ అవార్డుల వేడుక కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ ఈవెంట్‌ కోసం మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, రాజమౌళి, కీరవాణి సహా తదితరులు అమెరికాకు చేరుకున్నారు. తాజాగా యంగ్‌టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ అమెరికాకు పయనమయ్యాడు. సోమవారం ఉదయం తారక్‌.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కనిపించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. మొత్తానికి మా హీరో కూడా ఆస్కార్‌ వేడుకల్లో పాల్గొనబోతున్నాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌కు వెళ్లాల్సి ఉండగా తారకరత్న మృతి చెందడంతో వాయిదా పడింది. ప్రస్తుతం ఆస్కార్‌ వేడుకల కోసం అమెరికాకు వెళ్లిన యంగ్‌ టైగర్‌ వచ్చీరాగానే NTR30 మీద పూర్తిస్థాయిలో దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్స్‌ను తీసుకోనున్నట్లు సమాచారం.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)