ఓటీటీలోకి వచ్చేసిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' డాక్యుమెంటరీ

Published on Fri, 12/27/2024 - 11:37

ఆర్‌ఆర్‌ఆర్‌.. టాలీవుడ్‌ కీర్తిని ఆస్కార్‌ రేంజ్‌కు ఈ చిత్రం తీసుకెళ్లింది. ఈ సినిమాకు సంబంధించి తెరవెనుక జరిగిన ఆసక్తికర విషయాలను 'ఆర్‌ఆర్‌ఆర్‌ బిహైండ్‌ అండ్‌ బియాండ్' పేరుతో థియేటర్స్‌లో విడుదల చేశారు. ఇప్పుడు ఓటీటీలో కూడా రిలీజ్‌ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని మూడు గంటల పాటు చూసి అందరూ ఎంజాయ్‌ చేశారు. ఇప్పుడు ఆ సినిమా వెనక దాగి ఉన్న మూడేళ్ల కష్టాన్ని చూపించాలని మేకర్స్‌ అనుకున్నారు.

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటించిన ఈ చిత్రానికి ఎస్‌‌.ఎస్‌.రాజమౌళి  దర్శకత్వం వహించారు. 2022లో విడుదలైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు.  పీరియాడిక్‌ యాక్షన్‌ చిత్రంగా హిట్‌ కొట్టిన ఈ చిత్రంలో అలియాభట్‌, ఓలివియా మోరిస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, అలీసన్‌ డూడీ, దివంగత నటుడు రే స్టీవెన్‌ సన్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు.  ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.  

'ఆర్ఆర్ఆర్‌- బిహైండ్‌ అండ్‌ బియాండ్‌' పేరుతో డాక్యుమెంటరీని సిద్ధం చేశారు రాజమౌళి. ఈ ప్రాజెక్ట్‌ షూటింగ్‌ మొదలుపెట్టిన సమయం నుంచి 'ఆస్కార్‌' అందుకునే వరకూ జరిగిన ఆసక్తికర సంఘటనలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. డిసెంబరు 20వ తేదీ నుంచి ఎంపిక చేసిన మల్టీప్లెక్స్‌ స్క్రీన్‌లలో మాత్రమే దీనిని విడుదల చేశారు. అయితే, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. 

ఆర్‌ఆర్‌ఆర్‌ ఫ్యాన్స్‌ జక్కన్నకు థ్యాంక్స్‌ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. డిసెంబర్‌ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతన్న 'ఆర్ఆర్ఆర్‌- బిహైండ్‌ అండ్‌ బియాండ్‌' డాక్యుమెంటరీని మీరూ చూసేయండి. దీని రన్‌టైమ్‌ 1 గంట 38 నిమిషాలు ఉంది. ఇప్పటివరకూ బయటకు రాని ఆసక్తికర విషయాలను ఇందులో పంచుకున్నారు. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)