amp pages | Sakshi

బిగ్‌బాస్‌ విన్నర్‌ సన్నీపై దాడి, పోలీసులకు ఫిర్యాదు

Published on Thu, 06/09/2022 - 09:39

బిగ్‌బాస్‌ విన్నర్‌ వీజే సన్నీపై దాడి జరిగింది. బిగ్‌బాస్‌ షోతో మరింత పాపులరైయిన సన్నీ వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో పలు సినిమాలకు సంతకం చేసిన సన్నీ ప్రస్తుతం షూటింగ్స్‌ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సన్నీ హీరోగా ఏటీఎం అనే సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుకుంటుంది. ఈ క్రమంలో బుధవారం హైదరాబాద్‌లోని హస్తినాపురం ప్రాంతంలో ఈ మూవీ షూటింగ్‌ను జరుపుకుంది. అయితే షూటింగ్‌ జరుగుతుండగా సాయంత్రం సమయంలో ఓ రౌడీషీటర్ సెట్‌కు వచ్చి హల్‌చల్‌ చేశాడు.

అంతేగాక హీరో సన్నీతో గొడవకు దిగుతూ అతడిపై దాడి చేశాడు. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది వెంటనే సన్నీని షూటింగ్ నుంచి కారులో పంపించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రౌడీషీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా విజేగా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన సన్నీ పలు టీవీ షోలు, సీరియల్స్‌తో గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 5లో పాల్గొనే ఆఫర్‌ కొట్టేశాడు. ఈ షో తనదైన ప్రవర్తనతో బుల్లితెర ప్రేక్షకుల హృదయానలు గెలుచుకున్న సన్నీ బిగ్‏బాస్ సీజన్ 5 విజేతగా నిలిచి టైటిల్‌ అందుకున్నాడు.

Videos

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌