Breaking News

‘రోస్లిన్’ రివ్యూ : ఊహించని సీన్లు, ఊహకందని ట్విస్టులు

Published on Sun, 03/08/2026 - 11:20

మనిషికి నిద్ర అనేది శారీరక, మానసిక అవసరం. కాని మనకు వచ్చే కలలు కునుకు రానీయకుండా చేస్తే...కళ్ళు మూస్తే కలలో కదలాడే పాత్రలు కళ్ళెదుట నిలుస్తే, అమ్మో ఇంకేముంది..అనుకుంటాం. సరిగ్గా ఇదే నేపధ్యంలో అల్లుకుని రాసుకున్న కథే రోస్లిన్. వాస్తవానికి, అవాస్తవానికి అక్షరం తేడా ఉంటుంది, కాని ఆ తేడాలోనే కొన్ని జీవితరాతలు తలక్రిందులవుతాయి. అదే విషయాన్ని ఈ సిరీస్ మొత్తం అయ్యాక ప్రేక్షకుడికి అర్ధమవుతుంది. మొత్తం 6 భాగాలతో స్ట్రీమ్ అవుతున్న ఈ మళయాళ సిరీస్ హాట్ స్టార్ వేదికగా తెలుగులోనూ లభ్యమవుతుంది. 

నాటి ప్రముఖ నటీనటులైన మీనా, వినీత్ ప్రధాన పాత్రలలో నటించి మెప్పించారు.  రోస్లిన్ ఓ సైకలాజికల్ త్రిల్లర్. ముందు రెండు భాగాలు కొంచం సాగదీత అనిపించినా తరువాతి నాలుగు భాగాలు మాత్రం గుండె దడపుట్టిస్తాయి. మరీ సిరీస్ చివర్లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల మతి పోగొడతాయి. అంతలా ఈ సిరీస్ లో ఏముందో ఓ సారి చూద్దాం. 

ఈ సిరీస్ మొత్తం రోస్లిన్ అనే అమ్మాయి చూట్టూనే కథ తిరుగుతుంది. జాన్, శోభాల ఒక్కగానొక్క కూతరు రోస్లిన్. తను ఓ టీనేజ్ అమ్మాయి. రోస్లిన్ సమస్యేంటంటే తనకు ఎక్కువగా నిద్ర పట్టదు. ఎందుకంటే తన కలలో ఓ వ్యక్తి తనను చంపడానికి వస్తూ ఉంటాడు. దాదాపు ప్రతి రోజూ అదే కల వస్తూ ఉంటుంది. ఆ మనిషిని తలుచుకున్నప్పుడల్లా భయంతో ఒణికి పోతుంటుంది రోస్లిన్. ఇంతలో తన తల్లి స్నేహితురాలు అడగడం ద్వారా కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉండడానికి జెర్రీ అనే వ్యక్తి వస్తాడు. 

రోస్లిన్ జెర్రీని చూసి నిలువెల్లా ఒణికిపోయి స్పృహ తప్పిపోతుంది. ఎందుకంటే రోస్లిన్ కలలో తరచుగా కనిపించే వ్యక్తి జెర్రీయే. దీంతో రోస్లిన్ జెర్రీని తన ఇంట్లో నుండి పంపాలని శతవిధాలా ప్రయత్నిస్తుంటుంది. మరి రోస్లిన్ జెర్రీని ఇంట్లోనుండి తరిమేస్తుందా, అసలు కలలో వచ్చే వ్యక్తికి జెర్రీకి సంబంధం ఏమిటి... ఈ వివరాలన్నీ తెలియాలంటే రోస్లిన్ సిరీస్ చూడాల్సిందే. 

ముఖ్యంగా థ్రిల్లర్ జోనర్ ఇష్టపడేవాళ్ళకి ఇదో అద్భుతమైన సిరీస్. ఊహకందని ట్విస్టులతో ఊహించని సన్నివేశాలతో ప్రేక్షకుడిని ఊగిసలాడిస్తుంది ఈ రోస్లిన్. కాకపోతే ఈ సిరీస్ చూశాక కలలు అంటే కొంత కలవరపడతారేమో. వర్త్ టు వాచ్ ఫర్ ది వీకెండ్.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)