Breaking News

మోగ్లీ అందరికీ కనెక్ట్‌ అవుతుంది: హీరో రోషన్‌ కనకాల

Published on Sat, 12/13/2025 - 03:37

‘‘ఫలానా జానర్‌లోనే సినిమాలు చేయాలని అనుకోవడం లేదు. నటుడిగా అన్ని రకాల జానర్‌ సినిమాలూ చేయాలనుకుంటున్నాను’’ అని రోషన్‌ కనకాల చెప్పారు. రోషన్‌ కనకాల, సాక్షి మడోల్కర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మోగ్లీ 2025’. హర్ష చెముడు, బండి సరోజ్‌ కుమార్‌ కీలకపాత్రల్లో నటించారు. సందీప్‌ రాజ్‌ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది.

ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో రోషన్‌ కనకాల మాట్లాడుతూ– ‘‘మోగ్లీ 2025’ హానెస్ట్‌ లవ్‌స్టోరీ ఫిల్మ్‌. ప్రేక్షకులు ఏ మాత్రం బోర్‌ ఫీల్‌ కాకుండా సందీప్‌ రాజ్‌ రేసీ స్క్రీన్‌ప్లే డిజైన్‌ చేశారు. తన ప్రేమకోసం మోగ్లీ ఏం చేయడానికైనా రెడీగా ఉంటాడు. మరి... మోగ్లీ ప్రేమ కథకు వచ్చిన అడ్డంకులు ఏంటి? క్రిస్టోఫర్‌ నోలన్‌ (ఈ సినిమాలో బండి సరోజ్‌ కుమార్‌పాత్ర పేరు) నుంచి మోగ్లీకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనే అంశాలతో ఈ సినిమా కథ ముందుకు వెళుతుంది.

మోగ్లీ క్యారెక్టర్, ఈ సినిమా  ప్రేక్షకులందరికీ కనెక్ట్‌ అవుతుంది. ఈ కథలో కామెడీ, యాక్షన్‌... ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ ఉంటాయి. ఇంటర్వెల్, ప్రీ ఇంటర్వెల్‌ ఎంగేజింగ్‌గా ఉంటాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ కూడా అద్భుతంగా ఉంటాయి. ప్రస్తుతం ఒక రొమాంటిక్‌ లవ్‌స్టోరీ, ఒక ఇంటెన్స్‌ లవ్‌స్టోరీ సినిమాలు కమిట్‌ అయ్యాను’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నటన పరంగా మా అమ్మ (వ్యాఖ్యాత–నటి సుమ కనకాల), నాన్న (నటుడు రాజీవ్‌ కనకాల)ల సలహాలను అవసరమైనప్పుడు తీసుకుంటుంటాను’’ అని తెలిపారు. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)