Breaking News

మూడేళ్లలో చాలా నేర్చుకున్నాను: రోషన్‌

Published on Sun, 12/21/2025 - 03:06

‘‘నా సినిమాల కథలను ముందు నేనే వింటాను. నాకు నచ్చిన స్క్రిప్ట్స్‌ గురించి నాన్నతో (నటుడు శ్రీకాంత్‌) చర్చిస్తాను. నాన్న పూర్తి కథ వినరు కానీ స్టోరీ లైన్‌ వింటారు. అయినప్పటికీ  కథ, సినిమాల ఎంపికలో తుది నిర్ణయాన్ని నాకే వదిలేస్తారు. ‘చాంపియన్‌’ సినిమా కథ కూడా ఒక లైన్‌లా విన్నారు’’ అని రోషన్‌ చెప్పారు. ఆయన హీరోగా, అనస్వరా రాజన్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘చాంపి యన్‌’. ప్రదీప్‌ అద్వైతం దర్శకత్వం వహించారు. సి. అశ్వినీదత్, జీ స్టూడియోస్‌ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్, కాన్సెప్ట్‌ బ్యానర్స్‌పై ప్రియాంకా దత్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా రోషన్‌ పంచుకున్న విశేషాలు. 

⇒ నిజానికి హీరోలందరూ 25 ఏళ్లు ఏజ్‌లోనే ఇండస్ట్రీకి వస్తారు. నేను 21 ఏళ్లకే వచ్చేశాను. ‘పెళ్లి సందడి’ (2021) సినిమా తర్వాత నేను బ్రేక్‌ తీసుకున్నట్లు అనిపిస్తుంది కానీ, కమ్‌ బ్యాక్‌ ఇవ్వడానికి ఇదే సరైన వయసు. ఈ విరామం తీసుకోవడం కూడా పూర్తిగా నా నిర్ణయమే. యాక్టింగ్‌ అంటే హ్యూమన్‌ ఎమోషన్స్‌ తెలియాలి... దానికి ఒక మెచ్యూరిటీ కావాలి. ఈ మూడేళ్లలో చాలా ట్రావెల్‌ చేశాను... ఆ విధంగా చాలా నేర్చుకున్నాను. 

⇒  1948లో జరిగే కథ ‘చాంపియన్‌’. చరిత్రలో బైరాన్‌ పల్లి గురించి చాలామందికి తెలుసు. అందులో మైఖేల్‌ అనే ఒక ఫిక్షనల్‌ క్యారెక్టర్‌ని క్రియేట్‌ చేసి ‘చాంపియన్‌’ కథని చూపించడం జరిగింది. ఇండియాకి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, హైదరాబాద్‌కి స్వాతంత్య్రం రాని రోజుల్లో జరిగిన కథ ‘చాంపియన్‌’. నాపాత్ర ప్రాపర్‌ హైదరాబాదీ... అందుకోసం ఆ యాస స్పష్టంగా నేర్చుకున్నాను. ఈ మూవీ కోసం ప్రదీప్‌గారు, స్వప్నగారు, ఆర్ట్‌ డైరెక్టర్‌ తోటగారు ప్రతిదీ పరిశోధించారు. పీటర్‌ హెయిన్స్‌గారు అద్భుతమైన యాక్షన్‌ డిజైన్‌ చేశారు. షూటింగ్‌లో నాకు కొన్ని గాయాలు కూడా అయ్యాయి. 

⇒  మా సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో రామ్‌చరణ్‌ అన్న నా గురించి, మా టీమ్, సినిమా గురించి అంత బాగా మాట్లాడటం హ్యాపీ అనిపించింది. అఖిల్‌ అన్న కూడా నాకు మంచి ఫ్రెండ్‌. అలాగే తమన్‌ అన్న... మేమందరం కలిసి క్రికెట్‌ ఆడతాం. బడ్జెట్‌ విషయంలో నిర్మాతలు రాజీ పడకుండా ‘చాంపియన్‌’ నిర్మించారు. నేను చాలా మొహమాటంగా ఉంటాను. ‘కొంచెం ఓపెన్‌గా ఉండు, మాట్లాడు’ అని నాగ్‌ అశ్విన్‌గారు చె΄్పారు. 

⇒  నేను క్రికెటర్, మా చెల్లి డాక్టర్, మా తమ్ముడు ఐఏఎస్‌ కావాలనుకున్నారు నాన్న. నాకు కూడా క్రికెటర్‌ కావాలనే ఉండేది. అయితే నటుడయ్యాను. నా కొత్త సినిమాల ప్రకటన తర్వలోనే ఉంటుంది. ఇకపై రెండు సంవత్సరాలకి కనీసం మూడు సినిమాలు చేయాలనుకుంటున్నాను.   

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)