Breaking News

'రోలుగుంట సూరి' సినిమా రివ్యూ

Published on Fri, 11/14/2025 - 18:02

విలేజ్ ఎమోషనల్ డ్రామాగా తీసిన తెలుగు సినిమా 'రోలుగుంట సూరి'. ఈరోజు (నవంబరు 14) థియేటర్లలోకి వచ్చింది. అనిల్ కుమార్ పల్లా దర్శకత్వం వహించగా.. నాగార్జున పల్లా, ఆధ్యారెడ్డి, భావన నీలప్ హీరోహీరోయిన్లుగా నటించారు. తపస్వీ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై సౌమ్య చాందిని పల్లా నిర్మించారు. మరి ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

కథేంటి?
రోలుగుంట గ్రామంలో తక్కువ కులానికి చెందిన యువకుడు సూరి. కమల అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఓసారి కబడ్డీ మ్యాచ్‌ సందర్భంగా గొడవ జరుగుతుంది. సూరిపై అవమానాలు, దాడులు పెరుగుతాయి. గ్రామ ప్రెసిడెంట్ అయితే అంటరాని కులం అని సూరి కుటుంబాన్ని తొక్కేస్తాడు. చివరికి ప్రెసిడెంట్ మనుషులు సూరి తల్లిదండ్రులను ఇంటితో సహా కాల్చేస్తారు. ఈ సంఘటనల వెనుకున్న నిజమేంచి? సూరి తన పగను తీర్చుకున్నాడా? అనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
గ్రామీణ వాస్తవాలను, కుల వ్యవస్థని డైరెక్టర్ అనిల్ కుమార్ పల్లా రియలస్టిక్‌గా చూపించే ప్రయత్నం చేశారు. చూపించారో చూడగానే అర్థమౌతుంది. సూరి తల్లిదండ్రుల మీద దాడి సీన్ బాగా తీశారు. ఫైట్స్, రొమాన్స్.. యువతని ఆకట్టుకునేలా చూపించారు. సినిమా చూస్తున్నంతసేపు మంచి విలేజ్ ఫీల్ వచ్చింది. సూరి పాత్రలో నాగార్జున బాగా చేశాడు. ఆధ్యారెడ్డి, కమల అనే పల్లెటూరి అమ్మాయిగా ఆకట్టుకుంది. మరో హీరోయిన్ భావన నీలప్ కూడా చూడటానికి బాగుంది. మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ అయిన అనిల్ కుమార్ పల్లా.. గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. సుభాష్ ఆనంద్ సంగీతం వినసొంపుగా ఉంది. మిగిలిన విభాగాలు కూడా తమ వరకు న్యాయం చేశాయి. 'రోలుగుంట సూరి'.. ఓ రియలిస్టిక్ విలేజ్ ఎమోషనల్ డ్రామా. కులం, ప్రేమ, ప్రతీకారం తదితర అంశాలు మిళితమైన సినిమా. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)